
● రాజేంద్ర చోళుడి కీర్తిని చాటే విధంగా వేడుకలు ● హాజరైన
గంగైకొండ చోళపురంలో..
ఉత్సవాలకు శ్రీకారం
సాక్షి, చైన్నె : రాజేంద్ర చోళుడి కీర్తిని చాటే విధంగా గంగై కొండ చోళపురంలో వేడుకలకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఇక్కడి ఆలయంలో ఉదయాన్నే విశిష్ట పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వివరాలు.. అరియలూరు జిల్లాలోని గంగై కొండ చోళపురం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మితమైన విషయం తెలిసిందే. ప్రపంచ ప్రసిద్ది గాంచిన తంజావూరు బృహదీశ్వరాలయాన్ని తలపించే విధంగా ఇక్కడ శివాలయం నిర్మితమై ఉంది. దీనిని తమిళనాడును ఏలిన రాజేంద్ర చోళుడు నిర్మించినట్టు చరిత్ర చెబుతున్నది. చోళ కళా వైభవం, వాస్తు శిల్ప సంపదలకు సజీవ చరిత్రగా ఈ ఆలయం వెలుగొందుతోంది. ఈ ఆలయంలో ఏటా రాజేంద్ర చోళుడి జన్మదిన సందర్భంగా వేడుకలను నిర్వహించడం జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఆలయం నిర్మించి వెయ్యి సంవత్సరాలకు పైగాఅవుతుండటంతో ఆది తిరువాధిరై పేరిట వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయాన్నే జరిగిన విశిష్ట పూజలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. రాజేంద్ర చోళుడి కీర్తిని చాటే విధంగా ఇక్కడ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాల ముగింపు రోజైన 27న ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు రానున్నారు. తొలి రోజు జరిగిన పూజాది కార్యక్రమాలు, వేడుకలలో మంత్రులు స్వామినాధన్, శివ శంకర్, రాజేంద్ర, ఎంపీ తిరుమావళవన్ తదితరులు హాజరయ్యారు.
తామంతా తమిళులం
గంగై కొండచోళపురం ఉత్సవాల్లో ఎంపీ తిరుమావళవన్ మాట్లాడుతూ, తాము రాజేంద్ర చోళ రాజవంశం వారసులం...తామంతా తమిళులుగా ఉండటాన్ని గర్వకంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. డెల్టా జిల్లాలలో పుట్టే బిడ్డలకు నేటికి కూడా చోళ, వలవన్, రాజేంద్రన్, కరిగాలన్ అన్న పేర్లు పెట్టడం చూస్తూ ఉన్నామని వివరించారు. చోళ రాజు రాజేంద్ర చోళుడు తన తండ్రి రాజరాజ చోళుడు తంజావూరులో నిర్మించినట్లుగానే గంగైకొండలో ఒక శివలింగ ఆలయాన్ని నిర్మించారని గుర్తు చేస్తూ ఆ ఆలయంలో విగ్రహం లేదని, కానీ ఒక శివలింగం ఉందని వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర చోళుడు భారతదేశాన్ని , విదేశీ దేశాలను జయించిన గొప్ప ఘనత సాధించారన్నారు. గంగకొండ చోళపురంలో నిర్మించిన ఆలయం కూడా అంతే ప్రత్యేకమైనదని పేర్కొంటూ, గొప్ప తమిళుల వారసులం.అందరం ఎటువంటి వైరుధ్యాలు లేకుండా జీవించగలిగే సమాజంలో ఉన్నామని వ్యాఖ్యలు చేశారు. రాజేంద్రన్ చోళుడి ఘనతను రాబోయే తరాలు చెప్పగలిగే విధంగా పలు ఎకరాల విస్తీర్ణంలో మ్యూజియం నిర్మించేందుకు సీఎం స్టాలిన్‌చర్యలు తీసుకుఓవడం అభినందనీయమన్నారు.
సీఎం ప్రగతి పనులు
రాజేంద్ర చోళ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా అరియలూర్ జిల్లాలోని చోళగంగం సరస్సును రూ. 12 కోట్లతో అభివృద్ధి చేయనున్నమని సీఎం స్టాలిన్ ప్రకటించారు. రూ. 7.25 కోట్లతో పర్యాకంగా తీర్చిదిద్దనున్నామని వివరించారు. గంగైకొండ చోళపురంలో ఆది తిరువాధిరై వేడుకల సందర్భంగా సీఎం కొన్ని ప్రకటనల చేశారు. రాజు రాజేంద్ర చోళుడు జ్ఞాపకార్థం 10 ఎకరాలలో కొత్త మ్యూజియం నిర్మిస్తున్నామన్నారు. రూ. 22.10 కోట్లు కేటాయించామన్నారు. 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చోల గంగ సరస్సు తీరాలను బలోపేతం చేయనున్నామన్నారు. 15 కిలోమీటర్ల పొడవైన మిగులు జలాల నీటి తరలింపునకు కాలువలను నిర్మించనున్నామన్నారు.

● రాజేంద్ర చోళుడి కీర్తిని చాటే విధంగా వేడుకలు ● హాజరైన