
● రాష్ట్ర పర్యటనల బాటలో నేతలు ● నేటి నుంచి పళణి రెండో వ
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నేత ప్రజా చైతన్య యాత్రతో దూసుకెళ్తున్నారు. ఇక, తమ బలాన్ని చాటుకునేందుకు మరో రెండు పార్టీల నేతలు సన్నద్ధమయ్యారు. తమ యాత్రలకు సంబంధించిన పిలుపుతో లోగోలను పీఎంకే నేత అన్బుమని, డీఎండీకే నేత ప్రేమలత విజయకాంత్ తాజాగా విడుదల చేశారు.
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పదును పెట్టాయి. సీఎం ఎంకే స్టాలిన్ తన దైన శైలిలలో అధికారిక పర్యటనలతో క్షేత్రస్థాయిలో ముందడుగు వేస్తున్నారు. ప్రస్తుతానికి స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న ఆయన మరికొద్ది రోజులలో విశ్రాంతి తదుపరి జిల్లాల పర్యటనకు సన్నద్ధం కానున్నారు. ఇక, గత ఏడాది రాజకీయ తెరమీదకు వచ్చిన తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ఆగస్టులో మదురై వేదికగా జరిగే మహానాడు తదుపరి ప్రజా క్షేత్రంలో రోడ్ షోలకు సన్నద్దం అవుతున్నారు. వీరందరికంటే ముందుగా అన్నాడీఎంకేప్రధాన కార్యదర్శి పళణి స్వామి తమిళనాడు, తమిళ ప్రజలను రక్షిద్దామన్న నినాదంతో ప్రజా చైతన్యయాత్రలో దూసుకెళ్తున్నారు ఈ నెల 7వ తేది కోయంబత్తూరులో మొదలైన ఈ యాత్రం విజయవంతంగా తొలి విడతగాను బుధవారం పూర్తిచేసుకుంది. తంజావూరులో తొలి విడత యాత్రను పళణి ముగించారు. మలి విడత యాత్ర గురువారం నుంచి పుదుకోట్టై జిల్లా గందర్వ కోట నుంచి సాగనుంది. అధికారం కాపాడుకునేందుకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్, అధికారాన్ని చేజిక్కించుకుని తీరాలనే సంకల్పంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని పరుగులు తీస్తుంటే, ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం తానేనంటూ విజయ్ రేసులోకి దిగారు. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే ఆయా పార్టీల నేతలు తమ బలాలను చాటుకునేందుకు , కేడర్‌లోఉత్సాహాన్ని నింపే విధంగా యాత్రల బాట పట్టడం గమనార్హం. ఇందులో ప్రస్తుతం పీఎంకే నేత అన్బుమణి రాందాసు, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ఉన్నారు.
అన్బు వంద రోజుల యాత్ర
పీఎంకేలో అధికార వార్ అన్నది ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్యతారా స్థాయిలో సాగుతున్న విషయం తెలిసిందే. తన బలాన్ని చాటుకోవడమే కాదు, పీఎంకేను పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకునే దిశలో, తమ సామాజిక వర్గానికి మరింత చేరువయ్యే విధంగా అన్బుమణి పాదయాత్రకు సన్నద్దమయ్యారు. వన్నియర్లకు 10.5 శాతం రిజర్వేషనుల సాధన నినాదంతో ఈనెల 25వ తేది నుంచి తమిళనాడుప్రజ హక్కుల పునరుద్దరణ ప్రయాణం పేరిట యాత్రకు సన్నద్ధమయ్యారు. ఈ యాత్ర శుక్రవారం నుంచి నవంబర్ 1వ తేదీ వరకు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ నుంచి యాత్ర మొదలు కానున్నది. ఈయాత్రకు సంబంధించిన లోగోను బుధవారం అన్బుమణి వర్గీయులు విడుదల చేశారు.
కెప్టెన్ రథ యాత్ర
‘యాత్ర’ల కాలం
ఇక విజయకాంత్ మరణం తదుపరి పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా సుడిగాలి పర్యటనగా ప్రజల్ని, కేడర్‌ను ఆకర్షించేందుకు డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్‌రెడీ అయ్యారు. కెప్టెన్ రథ యాత్ర పేరనిట ఇంటింటా పర్యటనకు నిర్ణయించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడి పూండి నుంచి ఆగస్టు 3వ తేది సాయంత్రం 4 గంటలకు ఈ రథయాత్ర ప్రారంభించనున్నారు. ముందుగా ఆరంబాక్కంలోని వినాయకుడి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. బహిరంగ సభతో ఈయాత్ర మొదలుకానుంది. 4వ తేదీన ఆవడి అసెంబ్లీ నియోజకవర్గం, ఆవడి కార్పొరేషన్‌లో పర్యటన సాగనుంది. బూత్ కమిటీలతో, పార్టీ ముఖ్యులతో, అభిమానులతో సమావేశాలు సైతం నిర్వహించనున్నారు. 5వ తేదీ కాంచీపురం, 6వ తేదీ వేలూరు, 7న తిరుపత్తూరు, 8న కృష్ణగిరి, 9న ధర్మపురి, 10 సేలం తదితర ప్రాంతాలలో పర్యటించనున్నారు. తొలి విడత పర్యటన 23వ తేదీ వరకు సాగనున్నది. కేడర్ , అభిమానుల ఇళ్ల వద్దకే వెళ్లి, వారితో సంప్రదింపులు, పార్టీబలోపేతం దిశగా వ్యూహాలకు ప్రేమలత విజయకాంత్ పదును పెట్టే విధంగా ఈ పర్యటనను మలుచుకునే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించిన ప్రజాకర్షణ లోగోను బుధవారం విడుదల చేశారు. ఇక, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ సైతం పార్టీ వర్గాలతో చర్చలలో ఉన్నారు. తాను సైతం ప్రజా క్షేత్రంలోకి దూసుకెళ్లే దిశగా వ్యూహ రచన చేస్తున్నారు. అదే సమయంలో ఈ సారి ఒంటరిగా ఎన్నికలలోకి వెళ్దామా..? లేదా కూటమిగానా..? అన్న సంప్రదింపులుసైతం జరుపుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. పీఎంకే, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చిలను అక్కున చేర్చుకునేందుకు అన్నాడీఎంకే సిద్ధంగానే ఉన్నా, ఆ పార్టీల నిర్ణయాలు వెలువడాల్సి ఉంది. ఈ పార్టీలకు డీఎంకే కూటమిలో చోటు దక్కేది అనుమానమే అన్న చర్చ ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతోంది.

● రాష్ట్ర పర్యటనల బాటలో నేతలు ● నేటి నుంచి పళణి రెండో వ

● రాష్ట్ర పర్యటనల బాటలో నేతలు ● నేటి నుంచి పళణి రెండో వ