
క్లుప్తంగా
వాణియంబాడిలో కొండ
నుంచి జారిన పడిన బండ
వేలూరు: తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని నేతాజీ నగర్ ప్రాంతంలో సుమారు 5వేల మందికి పైగా జీవిస్తున్నారు. రోడ్డు పక్కన జీవిస్తున్న మునియప్పన్ ఇంటి సమీపంలోని కొండపై పెద్ద బండ రాయి ఉండేది. మూడు రోజులుగా పగలు, రాత్రి వేలల్లో వర్షాలు కురవడంతో సోమవారం అర్ధరాత్రి సమయంలో బండ జారిపడి వీధిలోకి చేరింది. బండరాయి దొల్లుతున్న శబ్దం విన్న స్థానికులు అర్ధరాత్రి సమయంలో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి సమయం కావడంతో బయట ఎవరూ లేక పోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆ దారిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకొని పొక్‌లైన్ యంత్రం సాయంతో బండ రాయిని తొలగించారు.
మైనర్ బాలికకు వేధింపులు
– యువకుడిపై కేసు నమోదు
తిరువొత్తియూరు: చైన్నె కోయంబేడు ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల మహిళ. ఈమె కోయంబేడు పోలీస్ స్టేషనన్‌లో ఓ ఫిర్యాదు చేశారు. అందులో..్ఙశ్రీ నా 17 ఏళ్ల కుమార్తెను ప్రేమిస్తున్నానని చెప్పి 18 ఏళ్ల యువకుడు వేధించాడు. దీంతో మనసు విరిగిపోయిన నా కుమార్తె ఆ యువకుడితో మాట్లాడటం మానేసింది. ప్రస్తుతం అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ నా కుమార్తెఫోనన్‌కు రోజూ ఫోన్ చేసి నిన్ను మర్చిపోలేను, మళ్లీ నన్ను ప్రేమించుని వేధిస్తున్నాడు. నా కుమార్తె అతన్ని హెచ్చరించింది. దీంతో కోపం పెంచుకున్న ఆ వ్యక్తి, ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా, చంపేస్తాను, ముఖంపై యాసిడ్ పోస్తాను అని బెదిరిస్తున్నాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలిశ్రీ అని పేర్కొంది. దీంతో యువకుడిని కోయంబేడు మహిళా పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా తాను బాలికను బెదిరించలేదని పోలీసులకు నిందితుడు చెప్పినట్లు సమాచారం.
లక్ష్యం సాధించే వరకు పోరాడాలి
తిరువళ్లూరు: విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నించాలని యూనిప్రెస్ సంస్థ డీజీఎం చంటిబాబు బెజవాడ పిలుపు నిచ్చారు. తిరువళ్లూరు జిల్లా కసువ గ్రామంలోని సేవాలయ స్వచ్ఛంద సంస్థ 37వ వార్షికోత్సవం సంస్థ వ్యవస్థాపక అద్యక్షుడు మురళీధరన్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చంటిబాబు బెజవాడ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 37 ఏళ్ల పాటూ విద్యార్దులకు ఉచిత విధ్యను అందించడం సామాన్యమైన విషయం కాధన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలన్న ఆయన, లక్ష్యం సాధనలో విజయం సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలని సూచించారు. అనంతరం సేవాలయ స్వచ్ఛంద సంస్థకు యూనిప్రెస్ సంస్థ 52 లక్షల రూపాయల విలువైన వేర్వేరు సహాయకాలను అందించడానికి ఒప్పందం జరిగింది. అనంతరం సేవాలయ స్వచ్ఛద సంస్థలో 5, 10, 15 సంవత్సరాల పాటూ పని చేసిన ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. అదే విధంగా 2024–25వ సంవత్సరంలో పదవ ప్లస్–2 పరిక్షల్లో ఉత్తమ మార్కులు సంపాధించిన వారికి, వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో సేవాలయ ట్రస్టీలు భువనేశ్వరి, అన్నపూర్ణ, అమర్‌చంద్ జైన్ కింగ్‌స్టన్, ఆనందన్, మధుసూదన్ పాల్గొన్నారు.
కూతురి గొంతు కోసి
తండ్రి ఆత్మహత్యాయత్నం
అన్నానగర్: ఐనావరంకు చెందిన సతీష్ (38) పాత స్పీకర్లను రిపేర్ చేయడంతోపాటూ ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడు. ఇతని కుమార్తె స్టెఫిరోస్ (7) రెండో తరగతి చదువుతోంది. భార్యతో విభేదాల కారణంగా సతీష్ తన కూతురితో ఒంటరిగా నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి సతీష్ తన కూతురు స్టెఫి రోస్‌తో కలిసి అలందూర్ సిమెంట్ రోడ్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో బస చేశాడు. ఈ పరిస్థితిలో సతీష్ మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో తన సోదరి కెష్యాకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో తన కూతురిని చంపి ఆత్మహత్య కూడా చేసుకుంటానని చెప్పి ఫోన్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేశాడు. దీంతో షాక్ కు గురైన కేష్యా అలందూర్ లోని హోటల్‌కు వెళ్లి అక్కడి సిబ్బందికి సమాచారం అందించారు. సతీష్ బస చేస్తున్న గదిని తెరిచి చూసేసరికి, స్టెఫిరోస్ గొంతు కోసి పడి ఉండగా, అతని తండ్రి సతీష్ సమీపంలోనే గొంతు కోసి, చేతులు కోసిన స్థితిలో ప్రాణాలకు పోరాడుతూ కనిపించాడు. పరంగిమలై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గురైన బాలిక స్టెఫిరోస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శవపరీక్ష కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ప్రాణాలతో పోరాడుతున్న సతీష్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ అతనికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

క్లుప్తంగా