
నల్లబ్యాడ్జీలు ధరించి విశ్రాంత ఉద్యోగుల ధర్నా
తిరువళ్లూరు: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నల్లబ్యాడ్జీలు ధరించి విశ్రాంత ఉద్యోగులు కడంబత్తూరు, తిరువళ్లూరు బీడీఓ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వివరాలు.. తిరువళ్లూరు బీడీఓ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమానికి సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు డేవిడ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సంఘం జిల్లా కార్యదర్శి లూర్ధుస్వామి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా లూర్దుస్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వున్న అంగన్‌వాడీ పౌష్టిహాకార తయారీ ఉద్యోగులకు న్యాయమైన పింఛన్‌ను అందించాలన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా అంగన్‌వాడీ, పౌష్టిహాకార తయారీ ఉద్యోగులకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల్లో వున్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. కొత్త పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అంగన్‌వాడీ పౌష్టిహాకార తయారీ ఉద్యోగుల జిల్లా అద్యక్షురాలు మణిమేఖల, యూనియన్ అధ్యక్షురాలు వానతి తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటూ కడంబత్తూరు బీడీఓ కార్యాలయం వద్ద విశ్రాంత ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.

నల్లబ్యాడ్జీలు ధరించి విశ్రాంత ఉద్యోగుల ధర్నా