
కొత్త ఆవిష్కరణలకు వీలుగా వీఎల్‌ఎస్‌ఐ లాబొరేటరీ
కొరుక్కుపేట: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ చిప్స్ టూ స్టార్టప్ చొరవతో చైన్నె వడపలనిలోని ఎస్‌ఆర్‌ఎం క్యాంపస్‌లో అత్యాధునిక వీఎల్‌ఎస్‌ఐ అండ్ ప్రాసెసర్ లాబొరేటరీని ఏర్పాటు చేశారు. దీనిని అతిథులుగా టెస్సోల్వ్ సెమీ కండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని ఏఎస్‌ఐసీ డిజైన్ సీనియర్ డైరెక్టర్ ఎస్ .దొరైరాజన్, వెరిఫికేషన్ అసోసియేట్ డైరెక్టర్ వెంకట సుబ్రమణియన్ పాల్గొని ఘనంగా ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెమికండక్టర్ టెక్నాలజీలలో ఆవిష్కరణలు , నైపుణ్యాలను అభివృద్దిని పెంపొందించే లక్ష్యంతో ఈ లాబొరేటరీ ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. స్వాగతోపన్యాసంను ఈసీఈ విభాగం హెడ్ డాక్టర్ ఎ. షర్లీ ఎడ్వర్డ్ చేయగా, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ కార్తీక్ లాబొరేటరీ ప్రాముఖ్యతను సభకు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ ఆర్.వెంకటేష్ బాబు, డాక్టర్ సి.విజయకుమార్ పాల్గొన్నారు.