
యువకుడిపై గూండా యాక్ట్
తిరువళ్లూరు: ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లలో తరచూ ఘర్షణలకు దిగడం, ఉచితంగా బిర్యానీ ఇవ్వాలని బెదిరింపులకు దిగడం, చైన్‌స్నాచింగ్ తదితర నేరాలకు పాల్పడుతున్న యువకుడిపై గూండా చట్టాన్ని ప్రయోగిస్తూ కలెక్టర్ ప్రతాప్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరువళ్లూరు జిల్లా ఆరణి ప్రాంతానికి చెందిన కార్తీక్ అలియాస్ కోడి కార్తీక్(23) ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లలో ఉచితంగా బిర్యానీ ఇవ్వాలని దాడులకు దిగేవాడు. చైన్‌స్నాచింగ్, చోరీలకు పాల్పడినట్టు చైన్నె, తిరువళ్లూరు, పెద్దపాళ్యం, ఆరణి తదితర ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్‌లలో ఎనిమిదికి పైగా కేసులు ఉన్నాయి. ఇతడి ప్రవర్తననూ మార్చుకోవాలని పలుసార్లు పోలీసులు హెచ్చరించిన తీరు మార్చకోకపోగా, మరింత రెచ్చిపోతూ ప్రజలను భయాందోళనకు గురి చేశాడు. దీంతో యువకుడిపై గూండా చట్టాన్ని ప్రయోగించాలని ఎస్పీ కలెక్టర్ ప్రతాప్‌కు సిపారసు చేశారు. ఇందులో భాగంగానే కార్తీక్ అలియాస్ కోడి కార్తీక్‌పై గూండా చట్టాన్ని ప్రయోగిస్తూ కలెక్టర్ ప్రతాప్ సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు.