
విజయవంతంగా డ్రీమ్ రన్నర్స్ –2025
సాక్షి, చైన్నె: చైన్నె వేదికగా ఆదివారం ఉదయాన్నే హెక్సా వేర్ డ్రీమ్ రన్నర్స్ హాఫ్ మారథాన్ 2025 విజయవంతంగా జరిగింది. 14వ ఎడిషన్‌గా జరిగిన ఈ రన్‌కు తమిళనాడు,కర్ణాటక, కేరళ, తెలంగాణాలలోని వివిధ ప్రాంతాల నుంచి 7 వేలమంది పైగా రన్నర్లు తరలివచ్చాయి. వివరాలు.. రన్ ఇన్ స్పైర్ ఫ్యూయల్ స్ట్రెంత్‌మెంట్ – ప్రతి అడుగు లెక్కించబడుతుంది అనే నినాదంతో డీఆర్‌హెచ్‌ఎం 2025 చైన్నె వేదికగా నిర్వహించ తలబెట్టిన ఈరన్‌కు నిర్వాహకులు నాలుగు నెలలు శ్రమించారు. డ్రీమ్ రన్నర్ యాప్‌తో పాటూ పలు సోషల్ మీడియా ద్వారా వివిధ ప్రాంతాలలో పరుగు పందెంలో రాణిస్తున్నవారిని గుర్తించి వారందర్నీ ఒకే వేదిక మీదకు ఈ రన్ ద్వారా ఆదివారం తీసుకొచ్చారు. జైనబ్ అకిల్, డాక్టర్ గోమతి నరసింహన్, మైథిలీ ప్రసాద్‌ల నేతృత్వంలో మహిళా రేస్ మేనేజ్‌మెంట్ బృందం పర్యవేక్షణలో జరిగిన ఈ రన్‌లో 21.1 కి.మీ మారథాన్‌ను రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్ జెండా ఊపి ప్రారంభించారు. 10 కి.మీ ట్రాఫిక్ పోలీసు అధికారి బండి గంగాధర్, వెల్స్ ఫార్గోలోని ఈవీపీ అండ్ గ్లోబల్ సీఈఓ రవి శ్రీనివాసన్, స్పెషలిస్టు ఆండ్రూ, ఆ గ్రూప్ అధ్యక్షుడు శివేంద్ర ఎస్ నేగి, రీబాక్ బ్రాండ్ హెడ్ అర్జున్ జెండా ఊపి ప్రారంభించారు. 21.1 కి.మీ దూరంరన్‌లో 5 వేల మంది రన్నర్లు దూసుకెళ్లారు. మిగిలిన వారు 10 కి.మీ రన్‌లో భాగస్వామ్యమయ్యారు. ఈ మారథాన్‌లో సుమారు 1,100 మంది మహిళా రన్నర్లు, 70 ఏళ్లకు పైబడ్డ 11 మంది సూపర్ సీనియర్ రన్నర్లు, 60 ఏళ్లు పైబడిన రన్నర్లు మరెందరితో పాటూ కృత్రిమ అవయవాలు ధరించి దివ్యాంగులు, ఆర్మీ, నేవి, కోస్టుగార్డ్, తమిళనాడు పోలీసు, చైన్నె మెట్ర రైలు, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన రన్నర్లు తరలి వచ్చారు.ఈ కార్యక్రమంలో హెక్సావేర్ టెక్నాలజీస్ ప్రతినిధులు కృష్ణ బాలగురునాథన్, జయకృష్ణన్ ఉన్ని కృష్ణన్, రేస్ డైరెక్టర్ జైనాబ్ అకిల్, డాక్టర్ గోమతి నరసింహన్, మైథిలీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విజయవంతంగా డ్రీమ్ రన్నర్స్ –2025