
డిప్యూటీ సీఎం నైనార్
సాక్షి, చైన్నె : అరియలూరులో జరిగిన బీజేపీ కార్యాక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కాబోయే డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు హోరెత్తాయి. అయితే, దీనిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అరియలూరులో ఆదివారం బీజేపీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడునైనార్ నాగేంద్రన్‌తోపాటుగా ముఖ్యులు హాజరయ్యారు. ఈసందర్భంగా అధ్యక్షుడ్ని ఆహ్వానించే క్రమంలో పార్టీ మహిళ నేత డిప్యూటీ సీఎం నైనార్ అంటూ నినదించారు. ఇదే అదనుగా అక్కడున్నవాళ్లంతా నినాదాలు చేయడంతో నైనార్ జాగ్రత్త పడ్డారు. తనను అలా పిలవ వద్దు అని వారించారు. కాగా, అన్నాడీఎంకే –బీజేపీ కూటమిలో సంకీర్ణ ప్రభుత్వం అన్న నినాదం మార్మోగుతున్న సమయంలోౖ నెనార్‌ను పార్టీ వర్గాలు డిప్యూటీ సీఎం అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.