
24 నుంచి పళణి మలి విడత పర్యటన
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి మలి విడత పర్యటన రూట్ మ్యాప్, షెడ్యూల్‌ను ఆదివారం ప్రకటించారు. ప్రజలను, తమిళనాడును రక్షిద్దామన్న నినాదంతో ప్రజా చైతన్య యాత్రకు ఈనెల 7వ తేదీన పళణిస్వామి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రకు అనూహ్య స్పందన అన్నాడీఎంకే వర్గాల నుంచి వస్తోంది. తొలి విడత పర్యటన 23వ తేదీ వరకు అని ముందుగా ప్రకటించారు. తాజాగా మలి విడత పర్యటన షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ మేరకు 24వ తేదిన పుదుకోట్టై జిల్లా గందర్వ కోట్టై నుంచి మలి విడత పర్యటన ప్రారంభం కానుంది. తొలి రెండు రోజులు పుదుకోట్టై జిల్లాలోని అసెంబ్లీ నియోజక వర్గాలలో పర్యటించనున్నారు. 26వ తేదీన శివంగంగై జిల్లా, ఆతదుపరి మూడు రోజుల అనంతరం 30, 31తేదీలలో రామనాథపురం జిల్లా ఆగస్టు 1,2 తేదిలలో తూత్తుకుడి జిల్లా, 4,5,6 తేదిలలో తిరునల్వేలి, తెన్‌కాశి జిల్లాలో, 7,8 తేదీలలో విరుదునగర్ జిల్లాలో పర్యటన జరగనుంది. కాగా, ఆదివారం కడలూరుజిల్లాలో పళణి పర్యటన విస్తృతంగా సాగింది.