వీరవణక్కం విప్లవ పాట ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

వీరవణక్కం విప్లవ పాట ఆవిష్కరణ

Jul 14 2025 5:01 AM | Updated on Jul 14 2025 5:01 AM

వీరవణ

వీరవణక్కం విప్లవ పాట ఆవిష్కరణ

ఎస్‌జే సూర్య,

ఏఆర్‌ రెహ్మాన్‌

తమిళసినిమా: విశారద్‌ క్రియేషన్‌న్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం వీరవణక్కం. అనిల్‌ వి.నాగేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఇందులో రితేష్‌ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని నుగత్తడియై తోళిల్‌ సుమంత్‌ వుళైప్పాళిగలే అంటూ సాగే చెప్పవా గీతాన్ని యాసిన్‌ నిజార్‌ పాడారు. నవీన్‌ భారతి రాసిన ఈ పాటకు జేమ్స్‌ వసంతన్‌ సంగీతాన్ని అందించారు. ఈ పాటను వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ, డాక్టర్‌ తోల్‌ తిరుమావలవన్‌ విడుదల చేశారు. చైన్నెలో ఈ పాట ఆవిష్కరణ జరిగింది. ఇందులో పాల్గొన్న తోల్‌తిరుమావలవన్‌ మాట్లాడుతూ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రంలోని తెండ్రలే మలై తెండ్రలే అనే పల్లవితో సాగే మరో పాటను ఇటీవల విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చినట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలోని పాటలను నిర్మాతకు చెందిన విశారద్‌ క్రియేషన్స్‌ యూట్యూబ్‌ చానల్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. చిత్ర దర్శకుడు అనిల్‌ వి నాగేంద్రన్‌, సహదర్శకుడు కేజీ.రామకుమార్‌, రితేష్‌, వీసీకే పార్టీ సహాయ కార్యదర్శి వన్ని అరసు పాల్గొన్నారు.

వీరవణక్కం విప్లవ పాట ఆవిష్కరణ 1
1/1

వీరవణక్కం విప్లవ పాట ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement