
శక్తి తిరుమగన్ విడుదలకు తేదీ ఖరారు
తమిళసినిమా: విజయ్ ఆంటోనీదో సెపరేట్ రూట్ అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ నది ఒంటరి పోరు అని పేర్కొనవచ్చు చిన్న పరిశ్రమంలో ఎంతో పోరాడి సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ శాఖలో విజయం సాధించి ఆ తర్వాత కథానాయకుడుగా అవతారం ఎత్తారు అక్కడ సక్సెస్ అయ్యి ఆ తర్వాత నిర్మాతగా ఎడిటర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఆయన కథానాయకుడు దర్శకుడు నిర్మాత ఎడిటర్ సంకేత దర్శకుడు అంటూ బహుముఖ ప్రతిభావంతుడుగా తనను తాను నిరూపించుకున్నారు. ఇటీవల విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించి, సంగీతాన్ని అందించి, నిర్మించిన చిత్రం మార్గన్. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మార్గం చిత్రాన్ని విజయవంతం చేసినందుకు గాను విజయ్ ఆంటోని కతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. ఇకపోతే ఈయన కథానాయకుడిగా నటించిన మరో చిత్రం శక్తి తిరుమగళ్. దీనికి ముందుగా పరాశక్తి అనే టైటిల్ నిర్ణయించారు అయితే ఆ టైటిల్ వేరే వారు రిజిస్టర్ చేయడంతో ఆ తర్వాత శక్తి తిరుమగన్ అనే టైటిల్ ఖరారు చేశారు. అదేవిధంగా తెలుగులోనూ రూపొందుతున్న ఈ చిత్రానికి భద్రకాళి అనే టైటిల్ నిర్ణయించారు. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తున్నారు. తృప్తి రవి నాయకిగా నటిస్తున్న ఇందులో వాగై చంద్రశేఖర్ సునీల్ గిరి పలని సెల్మురుగన్ కిరణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్ ప్రభు దర్శకత్వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఇది విజయ్ ఆంటోని కథానాయకుడు నటిస్తున్న 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని తమిళం ,తెలుగు భాషల్లో సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేయనట్లు అధికారికంగా ప్రకటించారు.