
రైలు ప్రయాణికుల పడిగాపులు
తిరుత్తణి: తిరువళ్లూరు వద్ద ఆదివారం వేకువజామున డీజిల్ ట్యాంకర్ల గూడ్సు రైల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంతో చైన్నె అరక్కోణం మార్గంలో రైళ్ల సేవలు ఆదివారం పూర్తిగా రద్దయ్యాయి. దీంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుత్తణి నుంచి చైన్నెకి వెళ్లే విద్యుత్ రైళ్ల సేవలను నిలిపివేయడంతో పాటు తిరుపతి నుంచి చైన్నె వెళ్లే సప్తగిరి, గరుడాద్రి ఎక్స్‌ప్రస్ రైళ్ల సేవలతో పాటు అన్నీ రైళ్ల సేవలు ఆగిపోయాయి. దీంతో తిరుత్తణి ఆలయానికి వచ్చిన భక్తులు పనుల నిమిత్తం ప్రయాణం చేసేవారు, తిరుత్తణి రైల్వే స్టేషన్‌లో ఉదయం నుంచి పడిగాపులుకాచారు. రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే స్టేషన్‌లో ప్రకటించడంతో బస్సుల ద్వారా ప్రయాణం చేయాల్సి రావడంతో బస్సుల్లో రద్దీ నెలకొంది.