
● 42 కుటుంబాల దత్తత
వినాయక మిషన్ లా స్కూల్‌లో శనివారం లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలకు శ్రీకారం చుట్టారు. న్యాయ విద్యార్థులు, సాధారణ ప్రజలతో ఈసందర్భంగా ఓపెన్ డే కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 42 ఇరుళర్ తెగ కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా విధాన కమిటీ చైర్మన్ డి మురుగేషన్, వీఎంఎల్‌ఎస్ ఉపాధ్యక్షులు డాక్టర్ అనురాధా గణేశన్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సురేష్ శామ్యూల్, జిందాల్ గ్లోబల్ లా స్కూల్‌కు చెందిన ఏ ప్రాన్సీస్ జూలియాన్, వీఎంఆర్‌ఎఫ్ ఛాన్స లర్ డాక్టర్ ఏ ఎస్ గణేశన్, డీన్ అనంత్ పద్మనాభవన్, న్యాయ నిపుణులు అంబిలిమీనన్, ఇన్బ విజ యన్ వీరరాఘవన్, డాక్టర్ అనంత్ పద్మనాభన్, ఆంటోనీ జూలియన్‌లు హాజరయ్యారు. – సాక్షి, చైన్నె