
ఘనంగా నాబార్డ్ 44వ వ్యవస్థాపక దినోత్సవం
కొరుక్కుపేట: నేషల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం రాత్రి చైన్నె వేదికగా ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను భారత ప్రభుత్వ ఫైనాన్సియల్ సర్వీసెస్ విభాగం సెక్రటరీ ఎం నాగరాజు , తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎన్ . మురునందం, నాబార్డ్ ఛైర్మెన్ శ్రీషాజీ కెవి ,నాబార్డ్ డిఫ్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఏకే సూద్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్‌సిస్ బ్యాంకు ఎండీలు, నాబార్డ్ సీనియర్ అధికారులు ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ముందుగా నాబార్డు 44 సంవత్సరాల ప్రయాణంలో గ్రామీణ పరివర్తన పట్ల అచంచలమైన నిబద్దతో పనిచేస్తుందన్నారు. ఆర్థిక, మౌలిక సదుపాయాలను అందుబాటలోకి తీసుకురావటం నుంచి ఆవిష్కరణ, స్థితిస్థాపకతలను పెంపొందించడం వరకు లక్షలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. భారతదేశం సమ్మిళిత వృద్ది వైపు వేగంగా అడుగులు వేయటంతోపాటూ డిజిటల్ పరివర్తన, గ్రామీణ సంస్థలకు మద్దతు, అట్టడుగు స్థాయి వారిని ప్రోత్సహించడంలో నాబార్డ్ కృషి ఎనలేదనిదని ఈసందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం అతిథిగా పాల్గొన్న ఎం. నాగరాజు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలకు పైగా నాబార్డ్ భారతదేశ గ్రామీణాభివృద్ధ్ది వ్యూహానికి మూలస్తంభంగా పనిచేసిందని కొనియాడారు. తమిళనాడులో నాబార్డ్ సహకారాలను తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం కొనియాడుతూ గ్రామీణ జీవనోపాధిని పెంపొందించటంలో నాబార్డ్ కీలక పాత్రపోసించిందని అని ప్రసంశించారు. సరిహద్దు ఔట్రీచ్‌ను బలోపేతం చేయడానికి న్యూ సబ్ – ఆఫీస్ ఇన్ లెఫ్, గ్రిప్ ప్రోగ్రామ్, రూరల్ టెక్ కోల్యాబ్, నివారన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.