
మాతృభాషపై మమకారాన్ని పెంచుకోవాలి
కొరుక్కుపేట: మాతృభాషపై మమకారాన్ని పెంచుకోవాలని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక సమితి అధ్యక్షుడు అజంతా డాక్టర్ శంకరరావు పిలుపునిచ్చారు. సమితి తరఫున 23వ వార్షిక పోటీలు గురువారం టి.నగర్‌లోని బాలానంద విద్యాలయంలో కార్యవర్గ సభ్యులు పసుమర్తి జయశ్రీ , డాక్టర్ టి.కల్పన, శివసుబ్రహ్మణ్యం, దామెర్ల పద్మావతి, బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని 8 పాఠశాలల నుంచి 130 మందికి పైగా తెలుగు విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పద్య పఠనం, వ్యాస రచన, చిత్ర లేఖనం, వక్తృత్వ ఇతర పోటీలను నిర్వహించారు. న్యాయ నిర్ణేతలుగా ఆముక్తమాల్యద, శారద, లలిత, వసంతలక్ష్మి, కె.రమాదేవి, గజగౌరీ, వసుంధర, లావణ్య, కమల, లలిత వ్యవహరించారు. దిట్టకవి అనంత పద్మనాభమూర్తి, పాల్గొన్నారు.