
వేడుకగా మన్నారుస్వామి వార్షికోత్సవం
తిరుత్తణి: మన్నారుస్వామి ఆలయ వార్షికోత్సవం గురువారం వేడుకగా నిర్వహించారు. తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగలో శ్రీదేవి, భూదేవి సమేత మన్నారుస్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనులు చేపట్టి మూడేళ్ల కిందట మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈక్రమంలో ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా స్వామికి అభిషేక, ఆరాధన పూజలు నిర్వహించారు. వేడుకల్లో తెన్నేటి కుటుంబీకులతో పాటు గ్రామీణులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. పంచాయతీ మాజీ సర్పంచ్ మునిరత్నం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.