
ఉత్సాహంగా స్నిగ్ద 2025 పోటీలు
కొరుక్కుపేట:శ్రీ కన్యకాపరమేశ్వరి మహిళా కళాశాలలోని కళాలయ ఫైన్ ఆర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ స్నిగ్ద 2025శ్రీ పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన సాంస్కతిక పోటీలు, ఫ్రెషర్స్ డే ఉత్సవాలు గురువారం విజయవంతంగా ముగిసాయి. గురువారం ఆన్ స్టేజ్ ఈవెంట్లుగా పాటలు, నత్యం తదితర పోటీలు నిర్వహించగా మొదటి సంవత్సరం విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యాపారవేత్త రాధాకష్ణన్ బాలాజీ హాజరై నక్షత్ర స్టూడెంట్ కౌన్సిల్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు బ్యాడ్జీలు పంపిణీ చేశారు. ముందుగా కళాశాల కరెస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్, కశాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ వణిత తదితరులు కలిసి అతిథిని ఘనంగా సత్కరించారు.
నక్షత్ర స్టూడెంట్ కౌన్సెల్ ప్రారంభం

ఉత్సాహంగా స్నిగ్ద 2025 పోటీలు