
ఘనంగా సిపాయిల తిరుగుబాటు దినోత్సవం
● అమర వీరులకు అధికారుల ఘన నివాళి
వేలూరు: వేలూరులో 219వ సిపాయిల తిరుగుబాటు దినోత్సవాన్ని పురష్కరించుకుని అమర వీరుల స్థూపానికి కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఎస్పీ మదివాణన్, అధికారులు పుష్పగుచ్ఛం ఉంచి ఘన నివాలలు అర్పించి గౌరవ వందనం చేశారు. 1806 జూలై 10వ తేదిన వేలూరు కోటలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మొట్ట మొదటి సారిగా ఇండియ సిపాయిలు తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో బ్రిటీష్ వారిని సుమారు 250 మంది బ్రిటీష్ అధికారులు, సిబ్బందిని అంతమొందించి బ్రిటీస్ దేశ జెండాను కోటపై దించి యూనియన్ జాక్ జెండాను ఎగర వేశారు. టిప్పు సుల్తాన్ పులి జెండాను కూడా ఎగరవేశారు. అయితే కోట బయట వున్న మేజర్ గూడ్స్ అనే వ్యక్తి అప్పటి రాణిపేటలోని ఉన్న గుర్రపు వీరులు వేలూరుకు వచ్చి తుపాకీతో వచ్చి కోట తలుపులు తెరిచిలోనికి ప్రవేశించి తిరుగుబాటు చేసిన 850 మంది ఇండియన్ ఆర్మీ సిబ్బందిని కాల్చి చంపారు. అదే విధంగా కోట బయట ఉన్న 600 మంది వీరులను పట్టుకొని వేలూరు, తిరుచ్చారాపల్లి జైలులో ఉంచారు. 1806 సంవత్సరంలో జరిగిన ఈ యుద్ధంలో మరణించిన వీరులను వేలూరు మకాన్ సిగ్నిల్ వద్ద పెద్ద గుంత చేసి వాటిలో పాతి పెట్టారు. దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన స్థలంగా, దేశంలోనే మొదటిసారి స్వాతంత్ర ఉద్యమం వేలూరులో జరగడంతో ఇండియ వీరులను పాతి పెట్టిన స్థలంలో పెద్ద స్థూపాన్ని ఏర్పాటు చేశారు. దీంతో సిపాయిల తిరుగుబాటు దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థూపానికి వివిధ పుష్పాలంకరణలు చేసి వర్ధంతి దినంగా ప్రతి సంవత్సరం జూలై 10వ తేదీన జరుపుకుంటున్నారు. అందులో భాగంగా గురువారం ఉదయం కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఎస్పీ మదివాణన్, డీఆర్‌ఓ మాలతి, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణన్, ఎమ్మెల్యే కార్తికేయన్, మాజీ సైనికుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ వేలు, అధికారులు స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.