● ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతే లక్ష్యం కావాలి ● సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలవండి ● విద్యార్థులకు సీఎం ఎంకే స్టాలిన్‌ పిలుపు ● ఐక్యంగా ఉంటే ఎవ్వరూ ఓడించ లేరని వ్యాఖ్య | - | Sakshi
Sakshi News home page

● ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతే లక్ష్యం కావాలి ● సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలవండి ● విద్యార్థులకు సీఎం ఎంకే స్టాలిన్‌ పిలుపు ● ఐక్యంగా ఉంటే ఎవ్వరూ ఓడించ లేరని వ్యాఖ్య

Jul 10 2025 8:14 AM | Updated on Jul 10 2025 8:14 AM

● ఆత్

● ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతే లక్ష్యం కావాలి ● సమగ్రా

సాక్షి, చైన్నె : తిరుచ్చి జమాల్‌ మహ్మద్‌ కళాశాలలో కోరల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ప్రారంభోత్సవ వేడుక, గ్లోబల్‌ జమాలియన్స్‌ బ్లాక్‌ భవనం ప్రారంభోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం ఎంకే స్టాలిన్‌ విద్యార్థులను పలకరిస్తూ ముందుకెళ్లారు. ఆయనతో కరచాలనానికి పెద్దసంఖ్యలో విద్యార్థులు ఎగబడ్డారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినా అనంతరం సీఎం స్టాలిన్‌ ప్రసంగించారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిరంతరం ప్రయాణిస్తున్నానే ఉన్నానని, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటునే ఉన్నానని గుర్తు చేశారు. అంతే కాదు, క్షేత్రస్థాయి అధ్యయన సమావేశాలకు కూడా హాజరవుతూ, నిరంతరం ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ తానూ ఇక్కడున్న వారిలా తానూ ఒక్కడ్నే అని వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను కలిసినప్పుడు తనలో కొత్త శక్తి వస్తుందని, అందుకే విద్యార్థులు పాల్గొనే కార్యక్రమం అయితే, వెంటనే అంగీకరించడం జరుగుతున్నట్టు చెప్పారు. తాను తిరువారూర్‌ పర్యటనకు వె ళ్తూ ఇక్కడకు వచ్చినట్టు వివరిస్తూ, 2006లో ఇక్కడ జరిగిన కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుక కోసం వచ్చానని, 2022లో జమాలియ బ్లాక్‌ శంకుస్థాపన వీడియో కాన్పరెన్స్‌ ద్వారా చేసినట్టు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన శ్రీఇస్లామిక్‌ తమిళ సాహిత్య సదస్స్ఙుకు తాను హాజరయ్యారనని, ఐక్యత, సోదరభావాన్ని ఎలా బలోపేతం చేయవచ్చో, స్నేహం , సమాజంలో అందరం ఒక్కటే అని చాటేనట్టు వివరించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సామరస్యానికి ప్రతీకగా ఈ కళాశాలలను అభివర్ణించ వచ్చు అని వివరించారు. విద్యారంగంలో 75 సంవత్సరాలుగా కలలను నిజం సాకారం చేస్తూ వస్టున్నటు వివరించారు.

గాడ్సే మార్గం వద్దు..

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో హాజీ జమాల్‌ ముహమ్మద్‌ సాహిబ్‌ కీలక పాత్ర పోషించి ఉన్నారని వివరిస్తూ, 1931లో మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన పోరాటంలో ఆయన పాల్గొన్నారని తెలిపారు. లండన్‌లో జరిగిన రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలోగాంధీజీకి ఒక బ్లాంక్‌ చెక్కును కూడా అందించారని, ఇందులో మీకు ఎంత డబ్బు కావాలన్నా రాసుకోండని, దాన్ని పోరాటానికి మద్దతు నిధిగా ఉపయోగించమని పేర్కొని ఉన్నారన్నారు. అలాగే, ఖాజా మియాన్‌ రౌథర్‌ కూడా వ్యక్తిగతంగా ఓ కాటన్‌ మిల్లును నడిపి ప్రజలకు ఉచితంగా వస్త్రాన్ని అందించండని ముందుకు వచ్చారని, ఈ ఇద్దరు గాంధీ మార్గాన్ని అనుసరించారన్నారు. ఇక్కడ అనేక మార్గాలు ఉన్నప్పటికీ, గాంధీ మార్గం – అంబేడ్కర్‌ మార్గం – పెరియార్‌ మార్గంను విద్యార్థులు ఎంపిక చేసుకోవాలని, అయితే, గాడ్సే గుంపులో మాత్రం కలవ వద్దు అని, ఈ మార్గం వద్దే వద్దు అని హితవు పలికారు. విద్యార్థులకు విద్య చాలా ముఖ్యం అని, ఆత్మవిశ్వాసం మెండుగా నింపుకుని సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కళాశాలలో చదువుకున్న వారెందరో ఉన్నత పదవులలో ఉన్నారని, పూర్వ విద్యార్థుల జాబితాను పరిశీలిస్తే అధికారులుగా, న్యాయమూర్తులుగా, శాస్త్ర వేత్తలుగా, మంత్రులుగా కూడా ఇక్కడ చదువుకున్నవారే ఉన్నారని వివరించారు. తన కేబినెట్‌లోని మంత్రి కేఎన్‌ నెహ్రూ, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం ఇద్దరు ఈ కళాశాల పూర్వ విద్యార్థులు కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇలాంటి ఉన్నత పదవుల జాబితాలో ఇక్కడున్న విద్యార్థులు అధిరోహించాలని, తమిళనాడు అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. అందరం ఐక్యంగా ఉంటే తమిళనాడును ఎవ్వరూ ఓడించ లేరని ధీమా వ్యక్తం చేశారు. తాను ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడటం లేదని, అ యితే, ఈ కళాశాల ఎందరో నాయకుల్ని తమిళనాడుకు ఇచ్చిందని, సమాజానికి సేవకులను అందించిందని, సామరస్య స్ఫూర్తి, దేశ భక్తిని కలిగించిందన్నారు.

విద్యార్థులతో కరచాలనం

విద్యకు ప్రాధాన్యత..

ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం నిరంతరం ప్రజాభివృద్ధితో పాటుగా విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నట్టు వివరించారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలన్న కాంక్షతో వివిధ పథకాలను అందించడమే కాదు, నైపుణ్యాల అభివృద్ధికి సైతం తోడ్పాటును అందిస్తున్నామని గుర్తు చేశారు. వివిధ విద్యా పథకాల ద్వారా తమిళ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మార్చడం, కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. నేటి యువతరం అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని, ఎల్లప్పుడూ యువతకు మద్దత ఇచ్చే విధంగా తమ పయనం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ అన్నీ.. అనేది తమ నినాదం! ఇదే.ద్రవిడ మోడల్‌ ! గత పాఠాలు, ప్రస్తుత అవకాశాలను ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్తు సుసంపన్నం చేసుకోవచ్చు అని, భవిష్యత్తు మీదే అని సూచించారు. విద్య ను అనేక సామాజిక పోరాటాల ద్వారా సాధించుకున్నామని, తమిళనాడు పోరాట ఫలితమే సామాజిక న్యాయం అని వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ‘ఓరనియిల్‌ తమిళనాడు’ ( తమిళనాడు అంటే ఒకే జట్టు) అని చాటుదామని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.ఎన్‌. నెహ్రూ, గోవి చెలియాన్‌, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, మెయ్యనాథన్‌, టీఆర్‌ పీ రాజా, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌, ఎంపీలు తిరుచ్చి శివ, నవాజ్‌ ఖని, సల్మా , శాసనసభ సభ్యులు ఇనిగో ఇరుదయరాజ్‌, అబ్దుల్‌ సమద్‌, తిరుచ్చి జిల్లా కలెక్టర్‌ శరవణన్‌, జమాల్‌ మొహమ్మద్‌ బిలాల్‌, జమాల్‌ మొహమ్మద్‌ కళాశాల అధ్యక్షుడు, సెక్రటరీ ఖాజా నజీముద్దీన్‌, కోశాధికారి జమాల్‌ మహమ్మద్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జార్జ్‌ అమల రత్నం తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిరువారూర్‌ పర్యటనకు వెళ్లిన సీఎం స్టాలిన్‌కు జనం బ్రహ్మారథం పట్టరు. దారి పొడవున ఆయనకు ఘనస్వాగతం పలికారు. రోడ్‌ షోలో జనాన్ని పలకరిస్తూ సీఎం స్టాలిన్‌ ముందుకు సాగారు.

● ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతే లక్ష్యం కావాలి ● సమగ్రా1
1/3

● ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతే లక్ష్యం కావాలి ● సమగ్రా

● ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతే లక్ష్యం కావాలి ● సమగ్రా2
2/3

● ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతే లక్ష్యం కావాలి ● సమగ్రా

● ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతే లక్ష్యం కావాలి ● సమగ్రా3
3/3

● ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతే లక్ష్యం కావాలి ● సమగ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement