
కానరాని సార్వత్రిక సమ్మె ప్రభావం
● కేవలం నిరసనలతో సరి ● కేరళ, పుదుచ్చేరికి ఆగిన రవాణా
సాక్షి, చైన్నె : కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మే బుధవారం తమిళనాట ప్రభావాన్ని చూపించ లేదు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. సాధారణంగానే రవాణా సేవలుతో పాటూ ఇతర సేవలు సాగాయి. అయితే ఎల్‌ఐసీ, ఆదాయ పన్ను, పోస్టల్ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేసే కార్మిక సంఘాలు విధులను బహిష్కరించారు.
కార్మిక సంఘాల నేతృత్వంలో నిరసనలు పలు చోట్ల జరిగాయి. వివరాలు.. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, నాలుగు లేబర్‌కడ్‌లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్దరించాలన్న నినాదంతో కార్మిక సంఘాలు ఒక రోజు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ సమ్మేకు తమిళనాట స్పందన కరువైంది. తమిళనాడులో డీఎంకే కార్మిక సంఘం, సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసి , తదితర 13 కార్మిక సంఘాలు ఈసమ్మేకు మద్దతు ప్రకటించాయి.అయితే, ప్రజలకు ఎలాంటి నష్టం అన్నది కలుగ కుండా కేవలం నిరసనలకు పరిమితం చేశారు. యథా ప్రకారం, ఆటో, బస్సులు, రైళ్ల సేవలన్నీ సాగాయి. రవాణా వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలుగల లేదు. వ్యాపార సంఘాలు ఈ సమ్మేకు మద్దతు ఇవ్వని దృష్ట్యా అన్ని రకాల దుకాణాలన్నీ తెరిచే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, సిబ్బంది విధులకు హాజరయ్యారు. సాధారణ రోజులలో ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి కొనసాగింది. అయితే, పోస్టల్, ఆదాయ పన్ను, ఎల్‌ఐసీ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కొన్ని చోట్ల విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. ఈ సమ్మె ప్రభావం అన్నది తమిళనాట కాన రాలేదు. అయితే, కేరళ పూర్తి స్థాయిలో, పుదుచ్చేరిలలో కొంత మేరకు సమ్మె ప్రభావం కనిపించింది. దీంతో తమిళనాడు నుంచి కేరళ, పుదుచ్చేరి వైపుగా వెళ్లిన బస్సులు రాష్ట్రాల సరిహద్దులకే పరిమితం చేశారు. కోయంబత్తూరు, సెంగోట్టై, కన్యాకుమారి , తేని, నీలగిరిలలోని కేరళ సరిహద్దుల చెక్ పోస్టుల వరకే తమిళనాడు బస్సులు సాగాయి. పుదుచ్చేరి వైపుగా కడలూరు, విల్లుపురం సరిహద్దులకే పరిమితం చేశారు.
ధర్నాలను అడ్డుకున్న పోలీసులు
కార్మిక సంఘాల నేతృత్వంలో చైన్నెతో పాటూ పలు నగరాలలు, జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రామాలు జరిగాయి. ధర్నాలు , రాస్తారోకోలకు నిరసన కారులు దిగగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. చైన్నెలో అన్నా సాలై, గిండి, అంబత్తూరు, తిరువొత్తియూరులలో కార్మిక సంఘాలు రాస్తారోకోకు దిగడంతో వాహనాల రాక పోకలకు ఆటంకం తప్పలేదు. అన్నాసాలై, గిండిలలో నిరసనలతో నగరంలో రెండు గంటల పాటూ తీవ్ర వాహన రద్దీతో ట్రాఫిక్ కష్టాలు వాహన దారులకు తప్పలేదు. చైన్నెలో నిరసనకు దిగిన 1,500 మంది కార్మిక సంఘాల ముఖ్య నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

కానరాని సార్వత్రిక సమ్మె ప్రభావం