
డివైడర్‌ను ఢీకొన్న మినీ బస్సు
వేలూరు: డివైడర్‌ను మినీ బస్సు ఢీకొన్న సంఘటనలో పదిమంది గాయపడ్డారు. అనకట్టు నియోజక వర్గంలోని తట్టాన్‌గుట్టై గ్రామంలో సోమవారం సాయంత్రం వివాహ వేడుకలు జరిగాయి. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం సేలం నుంచి మొత్తం 15 మంది కళాకారులు మినీ వ్యాన్‌లో వచ్చి నాట్య కళను ప్రదర్శించి, అనంతరం మంగళవారం ఉదయం అదే వ్యాన్‌లో సేలం నగరానికి బయలు దేరారు. వ్యాన్ పింజీమందై అటవీ ప్రాంతం వద్ద వెళుతున్న సమయంలో మినీ బస్సు అదుపు డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో 10 మంది కళాకారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. తోటి కళాకారులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందజేశారు. అంబులెన్స్ రావడానికి ఆలస్యం కావడంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనచోదకులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు అనకట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● పది మందికి తీవ్ర గాయాలు

డివైడర్‌ను ఢీకొన్న మినీ బస్సు