
ఆణి రథోత్సవం
నెల్లయ్యప్పర్ సన్నిధిలో
జ్యేష్టాభిషేక ఉత్సవాలు ప్రారంభం
సాక్షి, చైన్నె: తిరునల్వేలిలో ప్రసిద్ధి చెందిన నెల్లయ్యప్పర్ ఆలయంలో ఆణి బ్రహ్మోత్సవాల భాగంగా మంగళవారం రథోత్సవం కనుల పండువగా జరిగింది. గత వారం రోజులుగా తిరునల్వేలి(నెల్‌లై) నగర నడి బొడ్డున నెల్లయ్యప్పర్, గాంధీ మది అమ్మన్ పేరిట శివ, పార్వతిలు కొలువై ఉన్నారు. ఇక్కడ ఆణి ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ధ్వజారోహణం గత వారం జరిగింది. ఈ ఉత్సవాలలో ముఖ్యఘట్టం మంగళవారం జరిగింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్త జనం సోమవారం రాత్రే నెల్‌లైకు చేరుకున్నారు. హరోం..హర.., మహాదేవ నామస్మరణలు మార్మోగాయి. వేకువ జామున రెండు గంటల నుంచే ఆలయంలో ఉత్సవ వేడుక మొదలైంది. ఉదయాన్నే రథోత్సవం కనుల పండువగాజరిగింది. స్వామి అమ్మవారు రథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. మహాదేవా...శంభో శంకరా అన్న నామస్మరణనడుమ స్వామి వారి రథం కదిలింది. దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, స్పీకర్ అప్పావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కాంగ్రెస్ ఎంపీ రాబర్డ్ బ్రూస్ ఒకే వేదిక భక్తి కార్యాక్రమంలో కనిపించారు. నలుగురు ఒకే చోట నిలబడి రథాన్ని లాగుతూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్త జనుల జయజయ ధ్వానాలు, మేళ తాళాల నడుమ కనుల పండువగా రథోత్సవం జరిగింది. భక్తులు లక్షల్లో తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.
రౌడీ అరెస్టు
అన్నానగర్: 15 ఏళ్లుగా పరారీలో ఉన్న చూలైమేడు రౌడీ ఆవు దినేష్ పోలీసులు అరెస్టు చేశా రు. చైన్నెలోని చూలైమేడుకు చెందిన ప్రముఖ రౌడీ దినేష్‌పై వివిధ కేసులు ఉన్నాయి. దినేష్ 15 ఏళ్ల నుంచి పరారీలో ఉన్నాడు. ఈ పరిస్థితిలో తన సహచరుల ద్వారా తాను చనిపోయానని పోలీసులను నమ్మించిన దినేష్, అజ్ఞాతంలో ఉంటూ పలు నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. దీనిపై నిఘా పెట్టిన చైన్నె పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, ఆంధ్రప్రదేశ్‌లో దాక్కున్న ఆవు దినేష్‌ను అరెస్టు చేశారు.
మద్యం, లాటరీ టికెట్ల కేసులో ఇద్దరు..
సేలం: మద్యం, లాటరీ టికెట్ల విక్రయం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈరోడ్ జిల్లా లోని భూతప్పడిలో మద్యం బాటిళ్లను నిల్వ చేసి, మద్యం షాపులు మూసివేసినప్పుడు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అమ్మపైట్టె పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ కార్తీ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఈరోడ్ పీపీ అగ్రహారం కామరాజ్‌నగర్‌కు చెందిన కార్తి (45) ని అరెస్టు చేసి, 27 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, గోపి శార ద మరియమ్మన్ ఆలయం వెనుక ప్రాంతంలో సబ్ ఇన్‌స్పెక్టర్ సత్యన్ గస్తీకి వెళ్లిన సమయంలో ప్రభుత్వం నిషేధించిన కేరళ రాష్ట్ర లాటరీ టికెట్ల ను విక్రయి స్తున్న సిద్ధోడ్ నల్లకుండంపాళయానికి చెందిన సుబ్రమణి (75)ని అరెస్టు చేసి, 20 లాటరీ టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
భవానీసాగర్‌లో
పెరిగిన నీటిమట్టం
సేలం: భవానీసాగర్ ఆనకట్టలో నీటిమట్టం పె రిగింది. ఈరోడ్ జిల్లా ప్రజలకు తాగు,సాగు నీ టికి భవానీసాగర్ ఆనకట్ట ప్రధాన వనరు. 105 అడుగులు భవానీసాగర్ ఆనకట్ట పరిధి లోని ఈరోడ్, తిరుప్పూర్, కరూర్ జిల్లాల్లో 2.5 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి ఈ ఆనకట్ట ద్వా రా సాగునీరు అందుతుంది. గత కొన్నిరోజులు గా నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నందున, భవానీసాగర్ ఆ నకట్టకు నీటి ప్రవాహం పెరుగుతోంది. ఫలితంగా ఆనకట్టలో నీటి మట్టం కూడా పెరుగుతోంది. మంగళవారం ఉదయం నాటికి భవానీసాగ ర్ ఆనకట్ట నీటిమట్టం 95.31 అడుగులకు పెరిగింది. 3,249 క్యూబిక్ అడుగుల నీరు ఆనకట్టలోకి వస్తోంది. భవానీసాగర్ ఆనకట్ట నుంచి తాగునీటి కోసం 100 క్యూబిక్ అడుగుల నీటిని,తాడపల్లి–అరక్కన్కోట్టై నీటిపారుదల కోసం 800 క్యూబిక్ అడుగుల నీటిని, కళింగరాయన్ నీటిపారుదల కోసం 400 క్యూబిక్ అడుగుల నీటిని భవానీ నదికి విడుదల చేస్తున్నారు. లో యర్ భవానీ కెనాల్ ద్వారా సాగునీటి కోసం 5 క్యూబిక్ అడుగుల నీటితోసహా మొత్తం 1,305 క్యూబిక్ అడుగుల నీటిని విడుదల చేస్తున్నారు.
లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థుల మృతి
తిరువొత్తియూరు: పుదుచ్చేరిలో తండ్రితో బైకులో వెళుతున్న సమయంలో లారీ ఢీకొని ఇద్దరు విద్యా ర్థులు మృతి చెందారు. పుదుచ్చేరి ముత్తయ్య పా లయం ప్రాంతానికి చెందిన నడన సభాపతి ప్రభు త్వ ఉద్యోగి. ఇతనికి భార్య అనిత, జీవా (14), తువర శేషు (8) పిల్లలు ఉన్నారు. జీవా తొమ్మిదో తరగతి, తువర శేషు మూడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో నడన సభాపతి రోజు తన కుమారులను ముత్తయ్య పాలయం నుంచి పాఠశాలకు బైకులో తీసుకుని వెళ్లి వదిలిపెట్టి వస్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తన ఇద్దరు పిల్లలను బైక్‌లో తీసుకుని వెళుతుండగా ఉగటేరి, పొరయురు రోడ్డులో ఓ లారీ, వారి బైక్ ను ఢీకొంది. ఈ ఘటనలో సభాపతి, జీవా, తువ ర శేషు ఎగిరి, లారీ చక్రం కింద పడి, అక్కడికక్కడే మృతి చెందారు. సభాపతి స్వల్పంగా గాయపడ్డారు. అక్కడికి చేరుకున్న ప్రజలు లారీని అడ్డుకుని డ్రైవర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.
సేలం : త్రయోదశి తిథి, కేట నక్షత్రం సందర్భంగా ఈరోడ్ కోటలోని కస్తూరి అరంగనాథర్ ఆలయంలో జ్యేష్టాభిషేకం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్స వాల తొలి ఘట్టంగా ఉదయం 7 గంటలకు తిరుప్ప ల్లాండు, తిరుప్పళ్లియాజుల్చి, పుణ్యకవజనై హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు తిరుమంజనం, మూలవర్లకు తైలంసత్తుపది నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత కస్తూరి అరంగనాథర్ మూలవర్‌కు మహా దీపారాధన చేశారు. బుధవారం ఉదయం 7 తిరుప్పల్లాండు, తిరుప్పళ్లియాజుల్చి, తిరుమంజనం, తిరుపవడై పూజ, మహా దీపారాధన చేసి, భక్తులకు స్వామి ప్రసాదాలు అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉదయం అభిషేక పూజ, నాలాయిర దివ్య ప్రబంధ సేవ నిర్వహిస్తారన్నారు. 26న మండలపూజతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
నడిరోడ్డులో ప్రియుడిపై యువతి దాడి
తిరువొత్తియూరు: నడిరోడ్డులో ప్రియుడిపై ఓ యువతి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కోయంబత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరం నిర్వహించారు. శిబిరం ముగిసే సమయానికి జనసమూహం తగ్గుతూ కనిపించింది. కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు తమ పని ముగించుకుని, ఇళ్లకు తిరిగి వెళుతున్నారు. ఆ సమయంలో, ఒక యువ జంట కలెక్టరేట్ కార్యాలయం ముందు మాట్లాడుకుంటుండగా, ప్రజల ముందు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆగ్రహించిన యువతి తన ప్రేమికుడి చెంపపై ముఖంపై కొట్టింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంతంలో భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వడవల్లికి చెందిన ఆ యువతిని ప్రేమించిన తిరుప్పూర్ అవినాసిపాళయం ప్రాంతానికి చెందిన యువకుడు 9 నెలలుగా కోవైలో ప్రత్యేక ఇల్లు తీసుకుని, పెళ్లి చేసుకుంటానని ఇద్దరు కాపురం చేశారు. అనంతరం వివాహం చేసుకోనని నమ్మించి మోసం చేశాడని తెలిసింది. దీంతో పోలీసులు యువతి వద్ద ఫిర్యాదు తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కిడ్పాప్ కేసులో యువకుడి అరెస్టు
అన్నానగర్: తమిళనాడు విక్టరీ పార్టీ కార్యక్రమంలో ఫుడ్ పార్శిల్ కొనడానికి వెళ్లిన బాలికను కిడ్నాప్ చేసినందుకు ఒక యువకుడిని అరెస్టు చేశారు. చైన్నె మనలిలోని వడువైద్యయమ్మన్ నగర్‌లో సోమవారం తమిళ విక్టరీ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. అదే ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలిక ఆహార పదార్థాలు కోసం వెళ్లింది. తరువాత ఆ బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఆమె కోసం చాలా చోట్ల వెతికారు. కానీ ఆమె ఆచూకీ కనిపించలేదు. ఇదిలా ఉండగా, అదే ప్రాంతానికి చెందిన మురళి (23) అనే వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి, తన ఇంట్లో బంధించాడని తెలిసింది. తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి వెళ్లి చూడగా, బాలిక ఏడుస్తూ కనిపించింది. దీనిపై మురళిని ప్రశ్నించగా, తాను తాగి ఉన్నానని చెప్పాడు. అతను విరుద్ధంగా మాట్లాడాడు. దీంతో అతని చెరలో ఉన్న అమ్మాయి రక్షించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనాలి పుదునగర్ పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి మురళి పారిపోయాడు. ప్రత్యేక పోలీసు బృందం సభ్యులు గాలింపు చర్యలు చేపట్టి, సోమవారం రాత్రి అంబత్తూరులో దాక్కున్న మురళిని అరెస్టు చేశారు. అతను బాలికను ఎందుకు కిడ్నాప్ చేశాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఆణి రథోత్సవం