
● అపూర్వ కలయిక
కోయంబత్తూరులోని గవర్నర్ మెంట్ కాలేజ్ ఆఫ్‌టెక్నాలజీ(జీసీటీ)లో 2000 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిశారు. సిల్వర్‌జూబ్లీ వేడుకగా పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తామ చదువుకున్న తరగతిగదులు, ల్యాబ్, హాస్టళ్లను పరిశీలించారు. నాటి జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. ఇలాంటి కలయిక అన్నది జీసీటీ కెరీర్‌లోనే కాదు, తమ విలువలను, బంధాలను మరింత బలోపేతం చేసినట్టుగా నిర్వాహకురాలు సుభద్రతా శ్రీధరన్ పేర్కొన్నారు.
– సాక్షి, చైన్నె