
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
తిరుత్తణి: ట్రాఫిక్ నిబంధనలపై ద్విచక్ర వాహన చోదకులకు ట్రాఫిక్ ఎస్‌ఐ గంగాధరన్ మంగళవారం అవగాహన కల్పించారు. తిరుత్తణిలో ద్విచక్ర వాహన చోదకులతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతోపాటు హెల్మెట్ వినియోగం, రోడ్డు నిబంధనలు పాటించడంపై పోలీసులు తరుచూ అవగాహన కల్పిస్తున్నా వాహన చోదకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా పట్టణంలో నిత్యం రద్దీ నెలకొని వాహనాలు ట్రాఫిక్ స్తంభించి, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ గంగాధరన్ మంగళవారం అరక్కోణం రోడ్డులో నిబంధనలు పాటించకుండా వెళ్లిన ద్విచక్ర వాహన చోదకులను ఆపి, హెల్మెట్ వినియోగించడం, రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించి, హెచ్చరించి పంపారు.