తాంబరం–నాగర్‌కోయిల్‌ ప్రత్యేక రైలు రెండు వారాల పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

తాంబరం–నాగర్‌కోయిల్‌ ప్రత్యేక రైలు రెండు వారాల పొడిగింపు

Jul 8 2025 5:08 AM | Updated on Jul 8 2025 5:08 AM

తాంబరం–నాగర్‌కోయిల్‌ ప్రత్యేక రైలు రెండు వారాల పొడిగింప

తాంబరం–నాగర్‌కోయిల్‌ ప్రత్యేక రైలు రెండు వారాల పొడిగింప

కొరుక్కుపేట: తాంబరం–నాగర్‌కోయిల్‌ మధ్య వారానికో ప్రత్యేక రైలు (నెం. 06011) గత నెల వరకు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ప్రయోజనాల దష్ట్యా ప్రత్యేక రైలును మరో రెండు వారాల పాటు పొడిగించారు. దీని ప్రకారం తాంబరం నుంచి నాగర్‌కోయిల్‌కు వెళ్లే ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు తాంబరంలో బయలుదేరి, చెంగల్‌పట్టు, మేల్‌మరువత్తూరు, విల్లుపురం, చిదంబరం, మైలాడుతురై, కుంభకోణం, తంజావూరు, త్రిచీ, తంజావూరు, తిరుచ్చి, దివ్యనగర్‌, తంజావూరు, మీదుగా 14వ తేదీ సోమవారం ఉదయం 5.15 గంటలకు నాగర్‌కోయిల్‌కు చేరుకుంటుందని ఈ మేరకు దక్షిణ రైల్వే వెల్లడించింది.

సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో

13 కిలోల గంజాయి సీజ్‌

ఇద్దరు అరెస్ట్‌

తిరువొత్తియూరు: చైన్నె సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ 5వ ప్లాట్‌ఫామ్‌కు ఆదివారం పినాకిని ఎక్స్‌ప్రెస్‌ రైలు చేరుకుంది. ఆ సమయంలో, అనుమానాస్పదంగా పెద్ద సంచులను తీసుకెళ్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా, వారి వద్ద గంజాయి ప్యాకెట్లు కనిపించింది. తరువాత ఇద్దరినీ పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకెళ్లి విచారించగా, వారు శివగంగై జిల్లా నెహ్రూ బజార్‌ ప్రాంతానికి చెందిన విష్ణు వర్ధన్‌ (23) తిరుబువనం తాలూకాకు చెందిన హేమనాథ్‌ బాబు (22) అని తెలిసింది. వారు విజయవాడ నుంచి తీసుకుని వచ్చిన 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తరువాత, ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి పుళల్‌ జైలుకు తరలించారు.

నెహ్రూ సోదరుడికి ఊరట

సాక్షి, చైన్నె: ఆర్థిక వ్యవహారం విషయంగా దాఖలైన కేసులో మంత్రి కేఎన్‌ నెహ్రూ సోదరుడు రవిచంద్రన్‌కు ఊరట కలిగింది. సీబీఐ దాఖలు చేసిన కేసును మద్రాసు హైకోర్టు సోమవారం కొట్టి వేసింది. మంత్రి నెహ్రూగా సోదరుడు రవిచంద్రన్‌ డైరెక్టర్‌గా ఉన్న సంస్థలో ఆర్థిక వ్యవహారాలలోమోసం జరిగినట్టు ఆరోపణలు గతంలో బయలుదేరాయి. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ నుంచి రూ. 30 కోట్లు రుణం తీసుకుని ఇతర సంస్థలకు ఆయన దారి మళ్లించినట్టుగా విచ్చన ఫిర్యాదుతో సీబీఐ రంగంలోకి దిగింది. రవిచంద్రన్‌తో పాటూ పలువురిపై 2021లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఎగ్మూర్‌ కోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసు రద్దు కోసం హైకోర్టును రవిచంద్రన్‌ ఆశ్రయించారు. విచారణ అనంతరం సోమవారం తీర్పును న్యాయమూర్తి భరత చక్రవర్తి వెలువరించారు. ఈ కేసులో ఎలాంటి మోసం అన్నది జరగలేదని, అదే సమయంలో ప్రభుత్వ అధికారులకు ఇందులో సంబంధాలు లేదు అని తేల్చిచెప్పారు. ఈ కేసులో మోసం అన్నది జరగని దృష్ట్యా, విచారణను ఇంతటితో ముగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈకేసుకు సంబంధించిన నగదు వ్యవహారంలో జరిమానాను మాత్రం విధిస్తున్నట్టు ప్రకటించారు. రూ. 30 లక్షలు జరిమానాను రవిచంద్రన్‌కు విధిస్తూ, ఇందులో 15 లక్షలు సంబంధిత బ్యాంక్‌కు, మరో 15 లక్షలు సామరస్య ఒడంబడిక సంబంధించిన విచారణ కమిటీకి అప్పగించాలని ఆదేశించారు.

అన్నాడీఎంకేతో

పొత్తు ప్రసక్తే లేదు

– టీవీకే

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే కూటమితో పొత్తు ప్రసక్తే లేదని తమిళగ వెట్రికళగం (టీవీకే) ప్రకటించింది. గత వారం జరిగిన తమిళగ వెట్రి కళగం కార్యనిర్వాహక సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కూటమి విషయంగా స్పష్టతను ఇచ్చారు. బీజేపీ, డీఎంకేలను టార్గెట్‌ చేసి విరుచుకు పడ్డారు. బీజేపీతో గానీ, డీఎంకేతో గానీ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా ఈ కూటమిలతో పొత్తు ఉండదని, తమిళగ వెట్రికళగం నేతృత్వంలోనే కూటమి అన్నది స్పష్టం చేశారు. అలాగే, విజయ్‌ను సీఎం అభ్యర్థిగా ఆ సమావేశంలో ప్రకటించారు. అదే సమయంలో అన్నాడీఎంకే విషయంగా విజయ్‌ ప్రస్తావన తక్కువగా ఉండటంతో కొత్త చర్చ బయలుదేరింది. బీజేపీని వీడి అన్నాడీఎంకే బయటకు వస్తే పొత్తు పెట్టుకుంటారా? అన్న ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా ఏకం అవుదాం అంటూ పరోక్షంగా విజయ్‌కు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి పిలుపు నివ్వడం మరింత చర్చకు దారి తీసింది. దీంతో తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్‌ తరపున ఆ పార్టీ ప్రచార ప్రధాన కార్యదర్శి అరుణ్‌ రాజ్‌ మాట్లాడుతూ, అన్నాడీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే మీద ప్రజలకు నమ్మకం పోయిందని, మార్పు కోసం తమవైపుగా చూస్తున్నారన్నారు. తమతో కూటమి విషయంగా ఎలాంటి సంప్రదింపులు, చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement