
చైతన్య యాత్రకు పళణి శ్రీకారం
● అన్నతాలతో భేటీ ● ప్రజలతో మమేకం అవుతూ రోడ్ షో
సాక్షి, చైన్నె మక్కలై కాప్పోం..తమిళగల్తై కాప్పోం ( ప్రజలను, తమిళనాడును కాపాడుకుందాం) అన్న నినాదంతో పురట్చి తమిళర్ ఎలుచ్చి పయనం ( విప్లవ తమిళుడి చైతన్య యాత్ర)కు సోమవారం ఉదయం మేట్టు పాళయం వేదికగా అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శిపళని స్వామి శ్రీకారంచుట్టారు. మేట్టుపాళయం, గౌండం పాళయం నియోజకవర్గాల పరిధిలో ప్రజా క్షేత్రంలో దూసుకెళ్లారు. వివరాలు.. 2026 అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికార పగ్గాలను చేజిక్కించుకోవడం లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళణి స్వామి రాష్ట్ర పర్యటనకు నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలి విడతగా 23వ తేది వరకు ఆయన పర్యటన జరగనున్నది. ప్రజాక్షేత్రంలోకి దివంగత సీఎం జే జయలలిత బాణిని అనుసరించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఒక మినీ బస్సును ప్రచార రథంగా తీర్చిదిద్దారు.్ఙ మక్కలై కాప్పోం..తమిళగల్తై కాప్పోంశ్రీ అన్న పాటలు, పురట్చి తమిళర్ ఎలుచ్చి పయనం అన్న నినాదాలు మిన్నంటే విధంగా ప్రచార చైతన్య యాత్రకు కొంగు మండలంలోని కోయంబత్తూరు జిల్లా మేట్టు పాళయం నియోజవకర్గంలో ఉదయం శ్రీకారం చుట్టారు. ముందుగా ఇక్కడి వన భద్ర కాళి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలను స్వయంగా పంచి పెట్టారు. ఇక్కడ నుంచి యాత్రకు శ్రీకారం చుడుతూ రోడ్ షోతో ప్రజలతో మమేకం అయ్యేవిధంగా అడుగులు వేశారు. మార్గ మధ్యలో రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.వారి సమస్యలు విన్నారు. తాము అధికారంలోకి వస్తే అత్తి కడవు – అవినాశి నీటి పథకం రైతుల అభిష్టానికి అనుగుణంగామార్చడంజరుగుతుందని ఈ సందర్భంగా పళనిస్వామి ప్రకటించారు.
బీజేపీ నేతలతో కలిసి..
మధ్యాహ్నం వరకు రోడ్ షోగా సాగింది. ఆయన విశ్రాంతి తీసుకున్న హోటల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, ఇన్‌చార్జ్ అరవింద్ మీన న్,కేంద్ర సహాయ మంత్రిఎల్ మురుగన్ వచ్చారు. పళణిస్వామికి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛాలను అందజేశారు. ఆ తదుపరి పళణి స్వామి వాహనం నుంచిఅభిమానులను పలకరిస్తూ ముందుకు సాగారు. మేట్టు పాళయంకీరమడై బస్టాండ్ వద్ద జరిగిన సభలో ప్రసంగించారు. పళణిస్వామి వాహనం మీద నుంచి బీజేపీ నేతలు నైనార్, సహాయ మంత్రి ఎల్ మురుగన్‌తో పాటూ అన్నాడీఎంకే నేతలు ప్రజలకు అభివాదం చేశారు. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి బలాన్ని చాటే విధంగారెండు పార్టీల జెండాలు హోరెత్తించారు. రాత్రి గౌండం పాళయం నియోజకవర్గం పరిధిలోని శరవణ పట్టిలోజరిగిన బహిరంగ సభతో తొలి రోజు పర్యటనను పళణిస్వామి పూర్తిచేశారు.

చైతన్య యాత్రకు పళణి శ్రీకారం