
మాలీవుడ్‌లోకి సాయి అభయంకర్
తమిళసినిమా: యువ సంగీత తరంగం సాయి అభయంకర్ ఇప్పుడు దక్షిణాది చిత్రం పరిశ్రమను చుట్టేస్తున్నారనే చెప్పాలి. ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయిన ఈయన ఇప్పుడు సింగీత దర్శకుడిగా పలు భాషల్లో బిజీ అయ్యిపోయారు. ముఖ్యంగా తమిళంలో ప్రముఖ కథానాయకుల చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. నటుడు శింబు హీరోగానటిస్తున్న ఆయన 49వ చిత్రానికి, తెలుగులో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న డ్యూడ్ చిత్రానికి,లోకేశ్ కనకరాజ్ నిర్మిస్తున్న బెంచ్ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా తాజాగా ఈయన మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. పల్టీ అనే మలయాళ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈయన్ని నటుడు మోహన్‌లాల్ మలయాళ చిత్ర పరివ్రమలోకి ఆహ్మానిస్తున్న ఒక వీడియోను చిత్ర వర్గాలు విడుదల చేశారు. అందులో పల్లీ ఓనం, సాయి అభయంకర్ పేర్లతో శుభాకాంక్షలు తెలిపారు. కాగా పల్టీ చిత్రంలో షేన్ నిగామిన్ హీరోగా నటిస్తున్నారు. ఇది ఆయన నటిస్తున్న 25వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం ద్వారా ఉన్ని శివలింగం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని, సంగీతానికి, ఫైట్స్ అఽధిక ప్రాముఖ్యత ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. చిత్ర పాటలను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వస్తోందన్న ఆనందాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేశారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఓనం పండగ సందర్భంగా ఈ చిత్రం తెరపైకి రానుంది.
సంగీత దర్శకుడు సాయి అభయంకర్