ఇంటింటా దరఖాస్తులు..! | - | Sakshi
Sakshi News home page

ఇంటింటా దరఖాస్తులు..!

Jul 7 2025 6:46 AM | Updated on Jul 7 2025 6:46 AM

ఇంటింటా దరఖాస్తులు..!

ఇంటింటా దరఖాస్తులు..!

సమగ్ర కంటి సంరక్షణ సేవలు విస్తృతం
● ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్‌

సాక్షి, చైన్నె : ప్రతి ఒక్కరికి కంటి సంరక్షణ అందేవిధంగా సమగ్ర సేవలను విస్తృతం చేయాలని ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణియన్‌ వ్యాఖ్యానించారు. కోయంబత్తూరుకు చెందిన ఐ ఫౌండేషన్‌ గ్రూఫ్‌ నేతృత్వంలో చైన్నె వడపళణిలో 25వ సిగ్నేచర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో తమిళనాడులో తొలిసారిగా స్కిల్‌ టెక్నాలజీని పరిచయం చేశారు. కంటి సంరక్షణలో ఒక విప్లవాత్మక పురోగతిని తీసుకొచ్చే విధంగా అధునిక సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సెంటర్‌ను ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, సేవలను వివరించారు. తమిళనాడులో వైద్యం విస్తృతంగా అందుతోందని, చైన్నె నగరంతో పాటూ పలునగరాలలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఈ సందర్భంగా ఐ ఫౌండేషన్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ డి. రామమూర్తి మాట్లాడుతూ, అత్యాధునిక వైద్యవిధానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పద్మ భూషన్‌ డాక్టర్‌ నల్లికుప్పుస్వామి చెట్టి, ఆల్‌ ఇండియా ఆప్తాల్మోలాజికల్‌ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ పార్థ బిశ్వాస్‌, గాయని నిత్యశ్రీ మహాదేవన్‌, ఆ పౌండేషన్‌కు చెందిన డాక్టర్‌ చిత్రా రామమూర్తి, డాక్టర్‌ అంకిత బిసాని, డాక్టర్‌ శ్రేయస్‌ రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement