
గెలుపే లక్ష్యం
సాక్షి, చైన్నె : అధికారం కొనసాగే రీతిలో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో విస్తృతంగా పనిచేయాలని నేతలకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ఆదేశించారు. సోదరా కదిలిరా నినాదంలో భాగంగా నియోజవర్గాల నేతలతో నిర్వహిస్తున్న ఒన్ టూ ఒన్ కార్యక్రమం శనివారం డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో జరిగింది. తాజాగా పాపనాశం, మనాప్పరై, పట్టుకోట్టై నియోజకవర్గాల ముఖ్య నేతలతో స్టాలిన్ సమావేశమయ్యారు. బూత్‌కమిటీల పనితీరు, గ్రామాల్లో పార్టీ పరంగా జరుగుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లాయని ఆరా తీశారు. గ్రామాల్లో కార్యక్రమాలు మరింత వేగం పెరగాలని, అధికారం కొనసాగే రీతిలో గెలుపే లక్ష్యంగా ఒక్కో నియోజకవర్గంలో నేతల పనితీరు ఉండాలని ఆదేశించారు. సభ్యత్వ నమో దు ప్రక్రియలో ఎలాంటి పొరబాట్లకు ఆస్కారం ఇవ్వకుండా చేయాలని సూచించారు.