
లాకప్ డెత్‌ను నిరసిస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా
తిరువళ్లూరు: శివగంగై జిల్లా తిరుపువనం యూనియన్ పరిధిలో అజిత్ లాకప్‌డెత్‌ను నిరసిస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం గుమ్మిడిపూండిలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి డీవైఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్షుడు మునిరత్నం అధ్యక్షత వహించగా సంఘం జిల్లా అధ్యక్షుడు కలైయరసన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలైయరసన్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తరచూ లాకప్‌డెత్‌లు జరుగుతున్నా ఇంతవరకు సరైన న్యాయం జరగలేదన్నారు. పోలీసు స్టేషన్లలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఆధారంగా లాకప్‌డెత్‌పై పూర్థిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.