
హనుమంతునిపై కల్యాణ వెంకన్న
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి విహరించి భక్తులను ఆశీర్వదించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ చేపట్టారు.
రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

హనుమంతునిపై కల్యాణ వెంకన్న