● రోడ్డెక్కిన ఎలక్ట్రిక్‌ బస్సులు ●లో–ప్లోర్‌ బస్సులకు జెండా ఊపిన సీఎం ● పోలీసులకు పదోన్నతులు ● మెడికల్‌ ఆఫీసర్ల నియామకం ● శాంతి భద్రతలపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

● రోడ్డెక్కిన ఎలక్ట్రిక్‌ బస్సులు ●లో–ప్లోర్‌ బస్సులకు జెండా ఊపిన సీఎం ● పోలీసులకు పదోన్నతులు ● మెడికల్‌ ఆఫీసర్ల నియామకం ● శాంతి భద్రతలపై సమీక్ష

Jul 1 2025 4:38 AM | Updated on Jul 1 2025 4:38 AM

● రోడ

● రోడ్డెక్కిన ఎలక్ట్రిక్‌ బస్సులు ●లో–ప్లోర్‌ బస్సులకు

ఎలక్ట్రిక్‌ బస్సులకు జెండా ఊపుతున్న సీఎం స్టాలిన్‌

తమిళనాడులో ప్రభుత్వ రవాణా సంస్థలలో తొలిసారిగా మెట్రోపాలిటన్‌ ట్రానన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టును రూ.47.50 కోట్లతో పూర్తి చేసింది. అప్‌గ్రేడ్‌ చేసిన వ్యాసర్పాడి ఎలక్ట్రిక్‌ బస్‌ వర్క్‌షాప్‌ సీఎం ఎంకే స్టాలిన్‌ సోమవారం ప్రారంభించారు. రూ. 207.90 కోట్లతో సిద్ధంచేసిన 120 కొత్త ఫ్లోర్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు సేవలకు సీఎం స్టాలిన్‌ శ్రీకారం చుట్టారు.

సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించే విధంగా చైన్నె నగర భాగస్వామ్య ప్రాజెక్టు పరిధిలోని సీసీఐ అండ్‌ ఎస్‌యూఎస్‌పీ ఆధారంగా ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రాజెక్టుకు చర్యలు తీసుకున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో, మెట్రోపాలిటన్‌ ట్రాన్‌న్స్‌పోర్టేషన్‌ అథారిటీ కార్పొరేషన్‌ నేతృత్వంలో 625 కొత్త లో–ఫ్లోర్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు నడిచేందుకు చర్యలు తీసుకున్నారు.ఇందులో భాగంగా వ్యాసర్పాడి, పెరుంబాక్కం, పూందమల్లి, తండయార్‌ పేట వర్క్‌ షాపులలో ఒప్పందం ఆధారంగా ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపేందుకు వీలుగా ప్రాజెక్టుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా రూ. 697 కోట్లు నిర్ణయించారు. ఎంపిక చేసిన ఐదు వర్క్‌షాప్‌లలో తగిన భవనాలు, మౌలిక సదుపాయాలు, ఛార్జర్లు , ఇతర నిర్మాణ పనులు, విద్యుత్‌ బస్సుల నిర్వహణ కోసం అవసరమైన నిర్వహణ సౌకర్యం, కార్యాలయ పరిపాలన భవనం, సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు, కొత్త ట్రాన్‌న్స్‌ఫార్మర్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అలాగే అగ్ని ప్రమాదాల నివారణ లక్ష్యంగా మరిన్ని ఏర్పాటు చేశారు. ఒక్కసారి చార్జ్‌ చేసిన తర్వాత ఎయిర్‌ కండిషన్‌ రహితంగా 200 కి.మీ దూరం బస్సులు నడిపేందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం తొలిసారిగా మెట్రోపాలిటన్‌ ట్రానన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ నేతృత్వంలో వ్యాసర్పాడి ఎలక్ట్రిక్‌ బస్సు బస్‌ డిపోను రూ.47.50 కోట్లతో తీర్చిదిద్దారు. దీనిని ఉదయం జరిగిన కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. అలాగే 120 కొత్త లో–ఫ్లోర్‌ ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రజలు ఉపయోగానికి తీసుకొస్తూ జెండా ఊపారు. కొత్త లో–ఫ్లోర్‌ ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. మెట్లు నేల ఎత్తు నుంచి 400 మి.మీ ఎత్తులో ఉంటాయి. సాంకేతిక సౌకార్యాల ఆధారంగా బస్సు నేల నుంచి మరో 250 మి.మీ ఎత్తును పెంచుకునే వీలుంది. దివ్యాంగులు సులభంగా కిందకు దిగేందుకు, సీ్త్రలు,పిల్లలు, వృద్దులు ఎలాంటి ఇబ్బంది అన్నది లేకుండా బస్సులలో ఎ క్కడం, దిగడానికి ఏర్పాట్లు చేశారు. అందరికీ సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించే విధంగా అన్ని ఏర్పాట్లతో ఎలక్ట్రిక్‌ బస్సులను సన్నద్దం చేశారు. ఈ బసుసలను నగరంలోని కన్నదాసన్‌ నగర్‌, ఆర్కే నగర్‌,సత్యమూర్తి నగర్‌, వల్లలార్‌ నగర్‌, యానైగౌని, సెంట్రల్‌, పల్వన్‌, వార్‌మెమోరియల్‌, అన్నా సమాధి, బ్రాడ్‌వే , నెహ్రూ స్టేడియం, పులియంతోపు, మూలక్కడై, వ్యాసర్పడి, పూందమల్లి, పెరంబూరు, పెరియ పాళయం, మనలి, తదితర మార్గాలు, ప్రాంతాలు, కలైంజ్ఞర్‌శత జయంతి స్మారక బస్టాండ్‌ కిలాంబాక్కం వైపుగా దూసుకెళ్లనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు శివ శంకర్‌, పికే శేఖర్‌బాబు, ఎంపీలు కళానిధి వీరాస్వామి, ఎమ్మెల్యేలు ఆర్‌డి శేఖర్‌, మూర్తి, ఎబినేజర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, అదనపు కార్యదర్శి కె. ఫణీంద్రరెడ్డి, ప్రభు శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

● రోడ్డెక్కిన ఎలక్ట్రిక్‌ బస్సులు ●లో–ప్లోర్‌ బస్సులకు 1
1/3

● రోడ్డెక్కిన ఎలక్ట్రిక్‌ బస్సులు ●లో–ప్లోర్‌ బస్సులకు

● రోడ్డెక్కిన ఎలక్ట్రిక్‌ బస్సులు ●లో–ప్లోర్‌ బస్సులకు 2
2/3

● రోడ్డెక్కిన ఎలక్ట్రిక్‌ బస్సులు ●లో–ప్లోర్‌ బస్సులకు

● రోడ్డెక్కిన ఎలక్ట్రిక్‌ బస్సులు ●లో–ప్లోర్‌ బస్సులకు 3
3/3

● రోడ్డెక్కిన ఎలక్ట్రిక్‌ బస్సులు ●లో–ప్లోర్‌ బస్సులకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement