
కానిస్టేబుళ్లకు హోదా
అనంతరం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో 21 మంది ఫస్ట్ గ్రేడ్ కానిస్టేబుళ్లకు చీఫ్ కానిస్టేబుల్ హోదా కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఈ హోదా దక్కించుకున్న వారికి సీఎం స్టాలిన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అలాగే 2025–26 సంవత్సరానికి పోలీస్‌శాఖకు బడ్జెట్ నిధుల కేటాయింపునకు సంబంధించి వెలువడ్డ ప్రకటన మేరకు ఉద్యోగాలలో పదోన్నతుల దిశగా ఫస్ట్ క్లాస్ గార్డ్, చీఫ్ గార్డ్, స్పెషల్ అసిస్టెంట్‌లకు , ఇన్‌స్పెక్టర్ హోదాకు పదోన్నతికి కాలపరిమితి నిర్ణయించి అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. జూలై ఒకటి నుంచి ఈ కాల పరిమితిమేరకు ప్రయోజనాలను కల్పించనున్నారు. 2026 పస్ట్ గ్రేడ్ పోలీసులను నియమించారు. ఈ సమయంలో 11,488 మంది పోలీసు తదుపరి ర్యాంకులు దక్కుతాయి. తాజాగా 21 మంది ఫస్ట్ గ్రేడ్ పోలీసులకు చీఫ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎన్. మురుగానందం, హోంశాఖ కార్యదర్శి ధీరజ్‌కుమార్, డీజీపీ శంకర్‌జివాల్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల కట్టడికి తీసుకున్న చర్యలను గురించి జిల్లాల వారీగా పోలీసు అధికారులతో సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. ఆయా జిల్లాల వారీగా పరిష్కరించిన కేసుల గురించి ఆరా తీశారు. నేరాల కట్టడికి మరింత విస్తృత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మెడికల్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు ద్వారా ఇండియన్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ హోమియోపతి విభాగానికి ఎంపిక చేసిన 115 మంది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు సీఎం స్టాలిన్ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలోమంత్రి ఎం సుబ్రమణియన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి సెంథిల్‌కుమార్, హోమియోపతి విభాగం కమిషనర్ ఎం విజయలక్ష్మి, మెడికల్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు చైర్‌పర్సన్ పి. ఉమా మహేశ్వరి తదితరులుపాల్గొన్నారు.