
యాక్సెంచర్ లెర్న్ వాంటేజీతో ఐఐటీ మద్రాసు ఒప్పందం
కొరుక్కుపేట: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు (ఐఐటీ మద్రాసు)లోని యాక్సెంచర్ లెర్న్ వాంటేజ్ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ వెహికల్ అకాడమీ, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ అడ్వాన్సుడ్ ఆటోమోటివ్ రీసెర్చ్ సంయుక్తంగా ఆటోమోటివ్ ఓఈఎం, జీసీసీ కోసం ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాలకు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. దీనిద్వారా ఆటోమోటివ్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ మేరకు సోమవారం జరిగిన కార్యక్రమంలో యాక్సెంచర్ లెర్న్ వాంటేజ్ గ్లోబల్ లీడ్ కిషోర్ దుర్గ్, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి పాల్గొని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు , ఈ సందర్భంగా ఐఐటి మద్రాసులోని సెంటర్ ఫర్ అడ్వాన్సుడ్ ఆటోమోటివ్ రీసెర్చ్ (సీఏఏఆర్) ప్రొఫెసర్ ఇన్‌చార్జి కృష్ణన్ బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సిఏఏఆర్ ద్వారా ప్రారంభించబడిన విద్యా –పరిశ్రమ భాగస్వామ్యం అన్ని పక్షాలకు విజయమంతం అయిన నమూనా అని , ఇది ఎస్‌డివి ల వంటి కొత్త రంగాలలో తదుపరి తరం శ్రామిక శక్తి నైపుణ్యాన్ని పెంచడానికి వీలు కల్పిస్తుంది అని యాక్సెంచర్ లెర్న్ వాంటేజ్‌తో భాగస్వామ్యం కావటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (ఓఈఎంలు), గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు( జీసీసీలు) ఎస్‌డీవీ డొమైన్‌లో నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్ తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అంతకు ముందు యాక్సెంచర్ లెర్న్ వాంటేజ్ గ్లోబల్ లీడ్ కిషోర్ దుర్గ్ మాట్లాడుతూ ఐఐటి మద్రాసులోని సీఏఏఆర్‌తో మా సహకారం గేమ్ –చేంజర్ గా నిలుస్తుందన్నారు.