
రైలులో 29 కిలోల గంజాయి సీజ్
వేలూరు: గంజాయి, హాన్స్ వంటి గుట్కా , మత్తు పదార్థాలు తరలించకుండా పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి తమిళనాడు మీదుగా వెల్లే రైలులో తరచూ తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటకు వచ్చిన హాటియా ఎక్స్‌ప్రెస్ రైలును సోమవారం ఉదయం 3 గంటల సమయంలో తనిఖీ చేయగా రైలులోని ఫ్యాసెంజర్ పెట్టెలోని మరుగుదొడ్డిలో గంజాయి ప్యాకెట్లు మూడు ట్రావెల్ బ్యాగులో ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. వాటిలో మొత్తం 29 కిలోల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ గంజాను ఎవరు, ఎక్కడ నుంచి తరలిస్తున్నారు అనే విషయాలు తెలియరాలేదు. వీటిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
సీఈసీ వద్దకు పీఎంకే
పంచాయితీ
● ఢిల్లీలో అన్బుమణి బిజీబిజీ
సాక్షి, చైన్నె : పీఎంకేలో తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య అధికార వార్ తీవ్ర ఉత్కంఠగా అనేక మలుపులతో సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడ్ని తానే అని రాందాసు స్పష్టం చేస్తున్నారు.అ న్బుమణి వెన్నంటి ఉన్న వాళ్లను పార్టీ నుంచి తొలగించి, వారి స్థానంలో తన నమ్మిన బంటులను నియమిస్తూ వస్తున్నారు. అదే సమయంలో తానే పార్టీకి అధ్యక్షుడ్ని అంటూ తొలగించిన వాళ్లను అన్బుమణి మళ్లీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ పరిణామాలు పీఎంకేలో తీవ్ర గందరోళాన్ని సృష్టించి ఉన్నాయి. ఈ పరిస్థితులలో కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా పార్టీని తన గుప్పెట్లో తెచ్చుకునేవ్యూహంలో అన్బమణి పడ్డట్టు సమాచారాలు వెలువడ్డాయి. తనకు కేంద్రంలోని బీజేపీ పెద్దల మద్దతు ఉన్న దృష్ట్యా, వారి ద్వారా పావులు కదిపి ఎ న్నికల కమిషన్ లో పంచాయతీ పెట్టి పార్టీని తన గుప్పెట్లో తె చ్చుకునే వ్యూహంలో అన్బుమణి ఉన్నట్టుగా ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు అన్బుమణి ఢిల్లీ వెళ్లినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. ఆయన మద్దతు దారులు పేర్కొంటున్న సంకేతాల మేరకు ఆయన ఢిల్లీ వెళ్లి కేంధ్ర ఎన్నికల కమిషన్ వర్గాలను కలిసినట్టు తెలుస్తోంది. పార్టీకి తానే అధ్యక్షుడ్ని అని,పార్టీ సర్వ సభ్య సమావేశం ద్వారా తనను ఎంపిక చేశారని, పార్టీకి ఉన్నఅధికారాలు, అధ్యక్షుడిగా ఎన్నికల కమిషన్ ద్వారా తనకు దక్కిన అధికారుల తదితర అంశాల గురించి ఎన్నికల వర్గాల దృష్టికి వివరాలు తీసుకెళ్లినట్టు సమాచారం. అంతే కాకుండా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాలతో పాటుగా పలువురు ముఖ్యులను కలిసేందుకు అను మతి కోరి ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం.
సదస్సు
హిందూస్థాన్ వర్సిటీలో టెడెక్స్ పేరిట తొమ్మిది మంది నిపుణులను, వివిధ ఆవిష్కరణలను ఒకే వేదిక మీదకు తెస్తూ సోమవారం సదస్సు జరిగింది. యూఎస్‌కు చెందిన నాసా శాస్త్ర వేత్త డాక్టర్ రవి మార్క్ సహాయం, డాక్టర్ చొక్కలింగంలతో పాటుగా హిందూ స్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఛాన్సలర్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్, వైస్ చైర్మన్ డాక్టర్ అశోక్ జీ వర్గీస్‌లు పాల్గొని కొత్త ఆవిష్కరణలు, పరిణామం గురించి విశదీకరించారు.
– సాక్షి, చైన్నె:
ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పనులను పరిశీలించిన మంత్రి
కొరుక్కుపేట: చైన్నె వాల్ ట్యాక్స్ రోడ్డు, టానర్ తొట్టి వీదిలో ఉత్తర చైన్నె డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న కొత్త రక్త శుద్ది కేంద్రం, మింట్ ప్రాంతంలో నిర్మిస్తున్న 700 కొత్త ఇళ్లు, ఎలిఫెంట్ కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లు , కొత్త సాంఘిక సంక్షేమ కేంద్రం, క్రీడా సముదాయం అభివృద్ధి సహా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ పనులను మంత్రి పీకే శేఖర్ బాబు సోమవారం పరిశీలించారు. ఆ సమయంలో పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులు, కాంట్రాక్టర్‌లను ఆదేశించారు. ఈ తనిఖీలో గృహనిర్మాణం, పట్టణాభివృద్ది శాఖ సంయుక్త కార్యదర్శి కాకర్ల ఉషా తదితరులు పాల్గొన్నారు.

రైలులో 29 కిలోల గంజాయి సీజ్