
డిఫెన్స్ ఔట్రీచ్
డిఫెన్స్ అకౌంట్స్ విభాగం నేతృత్వంలో 206వ ఔట్రీచ్ కార్యక్రమాన్ని చైన్నెలోని కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ తిరుచ్చి ఆర్మీ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించింది. కేంద్ర సహాయమంత్రి ఎల్ మురుగన్, కంట్రోలర్ డాక్టర్ మయాంక్ శర్మ, దక్షిణ భారత ఏరియా లెఫ్టినెంట్‌జనరల్ కరణ్ బీర్ సింగ్‌బ్రార్, అకౌంట్స్ కంట్రోలర ఐడీఎఎస్ టి జయ శీలన్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈసందర్భంగా 200 మంది అధికారులకు, ఫెన్షనర్లకు సంక్షేమా పంపిణీతో పాటూ వారి సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకున్నారు. 14 మంది పెన్షనర్లకుటుంబాలకు రూ. 1.50 కోట్లు విలువైన చెక్కును మంత్రి మురుగన్ అందజేశారు. అలాగే అంబులెన్స్ సేవలకు శ్రీకారం చుట్టారు. –సాక్షి, చైన్నె

డిఫెన్స్ ఔట్రీచ్