
ఎంత హాయిలే చెల్లీ
తమిళసినిమా: తాము నటన ద్వారా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే తారలు మానసిక వినోదం కోసం అప్పుడప్పుడు జాలీగా విహారయాత్రలు చేస్తుంటారు. అది పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు. సుందరమైన ప్రదేశాల్లో విహరించడం మాత్రం కామన్. తాజాగా నటుడు సూర్య, జ్యోతిక దంపతులు సీషెల్స్‌లో వివరిస్తున్నారు. అలాగే నటి కాజల్ అగర్వాల్ భర్త, కొడుకు, చెల్లెలు నిషా అగర్వాల్ లోడుతో కలిసి ఇటీవల మాల్ దీవి మకి వెళ్లొచ్చారు. సందర్భం ఏమిటంటే కాజల్ అగర్వాల్ పుట్టినరోజు కావడమే. కాగా మాల్ దీవిలో కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్చులు, కొడుకు నెయిల్ కిచ్చులు, చెల్లెలు నిషా అగర్వాల్ కలిసి ఆనందంగా గడిపారు. భర్త బిడ్డతో మాల్ దీవిలోని సముద్ర తీరంలో జాలీగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా కాజల్ అగర్వాల్, చెల్లెలు నిషా అగర్వాల్ బికినీ దుస్తుల్లో స్మిమ్ చేశారు. అక్కడ ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను నటి కాజల్ అగర్వాల్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలకు అభిమానుల నుంచి లైకుల వైరల్ కొనసాగుతోంది. కాగా నటి కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రను పోషించిన కన్నప్న చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఆ చిత్రంలో కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా నటించారన్నది గమనార్హం.
అక్కాచెల్లెళ్ల జలకాలాటలు