
అపూర్వ కలయిక
విద్యార్థులుగా తలోదారిలో వెళ్లి పోయి 45 ఏళ్లు తరువాత వృద్ధులుగా తాము చదువుకున్న తరగతి గదిలో కలుసుకున్న అపూర్వ ఘటనకు కనకమ్మసత్రం పాఠశాల వేదికగా మారింది. వివరాలు.. తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం ప్రభుత్వ మహాన్నత పాఠశాలలో 1980–81 విద్యా సంవత్సరంలో ప్లస్–2 చదువుకున్న 35 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. వారిలో చాలామంది ఉన్నత చదువులు పూర్తి చేసి ఆర్మీ, పోలీసులు, వైమానిక దళం, విదేశాల్లో వివిధ ఉద్యోగాల్లో స్థిరపడి ఇటీవల వారందరూ పదవీ విరమణ చేశారు. ఈక్రమంలో పాఠశాల మిత్రులను కలుసుకోవాలన్న వారిలో కొందరి తపనకు ఇతర మిత్రుల సహకారంతో అందరినీ ఏకం చేశారు. ఆదివారం పాఠశాల వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి కుటుంబీకులతో విచ్చేసిన పాఠశాల మిత్రులను చాలా కాలం తరువాత చూసి ఉద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా వారు సంతోషంతో ముచ్చటించుకుని వారి జీవితాల్లో విశేషాలు, ఘటనలను గుర్తు చేసుకున్నారు. దాదాపు 80 ఏళ్లు పైబడిన వారి పూర్వ విద్యార్థులను వేదికపై బహుమతులతో సత్కరించి వారి అశీస్సులు పొందారు. అందరూ ఉత్సాహంగా విద్యార్థులు మారి విద్యార్థులు, ఉపాధ్యాయుల అనుబంధాన్ని పంచుకుని సంతోషంగా గడిపి సాయంత్రం తిరుగు పయనమయ్యారు. –తిరుత్తణి

అపూర్వ కలయిక