
అలరించిన సంగీత విభావరి
కొరుక్కుపేట: ప్రముఖ సంగీత గాయని నిత్యశ్రీ సంగీత కచ్చేరి ప్రేక్షకులను వీనుల విందు చేసింది. అలాగే రోబో శంకర్, స్టాండప్ కమెడియన్ విఘ్నేష్ విజయన్‌లు వినోద ప్రదర్శన అందరినీ ఆహ్లాదపరిచింది. శ్రీరంగంలో జీ– స్క్వాయర్ గ్రూప్ ఆధ్వర్యంలో జీస్క్వాయర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సినీ హాస్య ప్రముఖలతోపాటు సంగీత కళాకారులు పాల్గొని, తమదైన శైలిలో ప్రదర్శన ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 700 మందికి పైగా ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొని, ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా జీ స్క్వాయర్ నిర్వాహకులు మాట్లాడుతూ జీ స్క్వాయర్ జెన్ పేరుతో తిరుచ్చిలోని శ్రీరంగంలో ప్రిమియం రెసిడెన్షియల్ ప్లాట్, విల్లాలు ఏర్పాటు చేశామని, వీటికి విశేష స్పందన లభించి, 72 గంటల్లో రికార్డు స్థాయిలో ప్లాట్‌లను కస్టమర్లు బుక్ చేసుకున్నారని తెలిపారు.