
వైభవంగా గ్రామోత్సవం
శ్రీకాళహస్తి: పట్టణంలోని ద్రౌపదీసమేత స్వామి ఆలయంలో జరుగుతున్న తిరుణాళలో భాగంగా సోమవారం అర్జున, ద్రౌపది, శ్రీకష్ణస్వాము గ్రామోత్సవం వైభవంగా సాగింది. ధర్మరాజుల గుడి వద్ద నుంచి ప్రారంభమైన గ్రామోత్సవంలో పోతురాజు కత్తి పట్టుకుని ముందు వెళుతుండగా అర్జున, ద్రౌపదీ, శ్రీకష్ణ ఉత్సవమూర్తులు అనుసరించారు.
అర్జున మత్స్యయంత్ర ఛేదనం
ద్రౌపదీ సమేత ధర్మరాజు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సొమవారం రాత్రి అర్జునుడు మత్స్యయంత్ర ఛేదనం ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విల్లంబులు ధరించిన అర్జునుడి ఉత్సవమూర్తికి సర్వంగ సుందరంగా అలంకరించి, వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.