
ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలు ప్రారంభం
●మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు
కొరుక్కుపేట: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి . రెండు లక్షలకు పైగా కొత్త విద్యార్థులు కళాశాలల్లో చేరారు. గత మేలో ప్రారంభమైన అడ్మిషన్‌ల పక్రియ జూన్ నాటికి పూర్తి అయ్యింది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలల్లో సీట్లు నిండిపోయినప్పటికీ రిజర్వేషన్లు అధారంగా సీట్లు ఉన్నాయి. కళాశాల పరిపాలన తర్వలో ఆ సీట్లును భర్తీ చేయడానికి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం ప్రతీ కళాశాలలో 100కి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి . వీటిని భర్తీ చేయనున్నారు . ఈ పరిస్థితిలో మొదటి సంవత్సరం విద్యార్థులు సోమవారం ఉత్సాహంగా కళాశాలలకు విచ్చేసి తమ తరగతి గదులకు వెళ్లారు. నగరంలోని రాజధాని కళాశాల, నందనం ప్రభుత్వ కళాశాల, వ్యాసార్పాడ , ఆర్‌కే నగర్ ప్రభుత్వ కళాశాలల సీనియర్ విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికారు. అలాగే రాణిమేరీ కళాశాల , భారతీ కళాశాల, క్రిస్టియన్ ఉమెన్స్ కళాశాల, స్టెల్లా మేరీ కళాశాల, ఎథిరాజ్ కళాశాల, డిజి వైష్ణవ కళాశాల మొదలైన మహిళా కళాశాల విద్యార్థినులు కళాశాలల్లోకి ప్రవేశించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం కావడంతో బస్సులు , రైల్వే స్టేషన్‌లలో పోలీసులు అప్రమత్తంగా భద్రత విధుల్లో ఉన్నారు . కొన్ని ముఖ్యమైన ఆర్ట్స్ కళాశాలల ముందు కూడా పోలీసులను మోహరించారు.
వేలం చీట్టిల పేరిట
రూ.35 కోట్లు మోసం
బాధితుల ఆందోళన
తిరువళ్లూరు: వేలం చీట్టిలు, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట వందలాది మంది నుంచి రూ.35 కోట్ల మేరకు వసూలు చేసి, ఉడాయించిన మహిళను అరెస్టు చేయడంతోపాటు తమ నగదును తిరిగి ఇప్పించాలని కోరుతూ బాధితులు మహిళ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా పుట్లూరు ప్రాంతానికి చెందిన లూర్దుమేరీ తిరువళ్లూరు, పుట్లూరు, కాకలూరు, తిరునిండ్రవూర్, ఆవడి, పట్టాబిరామ్‌తోపాటు పలు ప్రాంతాల్లో వేలం చీట్టిలు, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట సంస్థలను నిర్వహించి, వందలాది మంది నుంచి డిపాజిట్లు స్వీకరించారు. వేలం చీట్టిలు పూర్తిగా కట్టిన వారికి 2024 నుంచి డబ్బులు ఇవ్వలేదని తెలుస్తుంది. ఇదే విషయంపై పలుసార్లు లూర్దుమేరీ వద్ద కోరినా సరైన సమాధానం రాలేదు. ఈ క్రమంలో డిపాజిట్‌దారులు, వేలం చీట్టిలు వేసిన వారికి సోమవారం నగదు చెల్లిస్తామని లూర్దుమేరీ ప్రకటించారు. దీంతో బాధితులు సుమారు వంద మంది వరకు ఆమె ఇంటి వద్దకు రాగా ఇంటికి తాళం వేసి కనిపించింది. దీంతో మోసపోయామని భావించిన బాధితులు ఆమె ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు.