
రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభం
పళ్లిపట్టు: కేశవరాజుకుప్పంలో అన్నా మరుమలర్చి పథకం ద్వారా రూ.12 లక్షల వ్యయంతో రేషన్ దుకాణానికి నూతన భవనం నిర్మించారు. నూతన భవనం సేవలను ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ క్రమంలో నూతన భవనం నుంచి రేషన్ దుకాణం సేవల ప్రారంభోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని, రేషన్ వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గ్రామీణులు గ్రామంలో మురుగు నీటి కాలువ, రోడ్లు దుస్థితిలో ఉన్నట్లు, వెంటనే పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పళ్లిపట్టు మండల డీఎంకే కార్యదర్శి సీజే.శ్రీనివాసన్, రేషన్ వస్తువులు పథకం సహాయ రిజిస్ట్రార్ బాలాజీ, సహకార సంఘం కార్యదర్శి శశికుమార్, డీఎంకే శ్రేణులు దండపాణి, మీసై వెంకటేశన్ తదితరులు పాల్గొన్నారు.