సూర్య చిత్రాన్ని కీర్తి వదులుకుందా? | - | Sakshi
Sakshi News home page

సూర్య చిత్రాన్ని కీర్తి వదులుకుందా?

May 29 2025 7:18 AM | Updated on May 29 2025 7:18 AM

సూర్య చిత్రాన్ని కీర్తి వదులుకుందా?

సూర్య చిత్రాన్ని కీర్తి వదులుకుందా?

తమిళసినిమా: పాన్‌ ఇండియా కథానాయకిగా గుర్తింపు పొందిన నటి కీర్తీసురేశ్‌. ఈమె మాతృభాష అయిన మలయాళంలో బాల నటిగా పరిచయమై ఆ తరువాత కథానాయకిగా నటించినా, క్రేజ్‌ తెచ్చుకున్నది మాత్రం తమిళం, తెలుగు భాషల్లోనే అన్నది తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో మహానటి చిత్రంలో నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ బ్యూటీ కథానాయకిగా టాప్‌ పొజిషన్‌లో ఉండగానే తన 15 ఏళ్ల నాటి స్నేహితుడిని ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగా ఉన్నా, వివాహానంతరం ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. అయితే బేబీ జాన్‌ చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన కీర్తీసురేశ్‌కు ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందించలేదు. తాజాగా మరో హిందీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా తెలుగులో విజయ్‌ దేవరకొండకు జంటగా నటించే అవకాశాన్ని అందుకున్నట్లు సమాచారం. తమిళం, తెలుగు భాషల్లో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈయన 46వ చిత్రంలోనూ కథానాయకిగా నటించే అవకాశం కీర్తీసురేశ్‌ను వరించిందని, అయితే ఆమె విజయ్‌దేవరకొండకు జంటగా నటించడంతో సూర్యతో నటించే అవకాశాన్ని వదులుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంతనో తెలియాల్సి ఉంది. మొత్తం మీద కీర్తి వివాహానంతరం మళ్లీ బిజీ అవుతున్నారన్నమాట. కాగా ఈమె ఇంతకుముందు సూర్యకు జంటగా తానా సేర్నంద కూటం చిత్రంలో నటించారన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement