
ఐసీఐఎస్‌డీ –25 అంతర్జాతీయ సదస్సు ఆరంభం
కొరుక్కుపేట: ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైనన్స్ అండ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైనన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ ట్రాన్‌న్స్‌ఫర్మేషన్ ( ఐసిఐఎస్ డి 2025) అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ స్థాయి సదస్సు సోమవారం నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెస్‌సీఎల్ టెక్ ఇంజినీరింగ్ అండ్ పరిశోధన సేవల గ్లోబల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ సాయినారాయణన్ గోపాలకష్ణన్ హాజరయ్యారు. గౌరవ అతిథిగా నాస్కామ్ అకాడెమియా అండ్ గవర్నమెంట్–రిలేషనన్స్ డైరెక్టర్ ఉదయశంకర్ పాల్గొని సదస్సును ప్రారంభించారు. ముందుగా సీఎస్‌ఈ విభాగాధిపతి డాక్టర్ గోల్డా దిలీప్ స్వాగతోపన్యాసం చేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి. దుర్గాదేవి సదస్సు లక్ష్యాలను వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సాయినారాయణన్ గోపాలకష్ణన్, మేధో వ్యవస్థల పరిణామం, ఉత్పాదక ఏఐ సవాళ్లపై మాట్లాడారు. స్థానిక సమస్యను, డొమైన్–నిర్దిష్ట సమస్యను పరిష్కరించడానికి ఇంజినీరింగ్ పరిష్కారాలు అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా సదస్సు సావనీర్‌ను విడుదల చేశారు. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె. అకిల వందన సమర్పణ చేశారు. అంతర్జాతీయ సదస్సులో వివిధ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.