
గిరివలయం రోడ్డులో రక్షణ కంచె
● రూ.35 లక్షలు విరాళం అందజేసిన రామ్‌రాజ్ కాటన్
వేలూరు: తిరువణ్ణామలైలోని శ్రీఅరుణాచలేశ్వరాలయంలో ప్రతి పౌర్ణమి రోజున భక్తులు లక్షల సంఖ్యలో ఆలయం వెనుక వైపున ఉన్న కొండను 14 కిలో మీటర్ల దూరం గిరివలయం వస్తారు. దీంతో గిరివలయం రోడ్డులో ఇరు పక్కల కంచె ఏర్పాటుకు భారతదేశంలోనే దోతీ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రామ్‌రాజ్ కాటన్ సంస్థ ముందుకు వచ్చింది. యాత్రికుల భద్రత పెంచడం, చుట్టు పక్కల వ్యవసాయ భూముల్లోకి వన్య ప్రాణుల చొరబాట్లను అరికట్టేందుకు కాపాడేందుకు రూ.35 లక్షలతో కంచెను ఏర్పాటు చేసి, విజయ వంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా రామ్‌రాజ్ కాటన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ నాగరాజన్ మాట్లాడుతూ పవిత్ర స్థలాలను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉందన్నారు. తమ సంస్థ ఆధ్యాత్మిక శ్రేయస్సు, వ్యవసాయ భద్రత, పర్యావరణ సమతుల్యతను ఒకే చోట చేర్చిందన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఈ కంచెతో భక్తులకు ఎంతో రక్షణ కలుగుతుందన్నారు. భక్తుల పరిరక్షణ కోసం ఇటువంటి కంచెలను తాము దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడంలో సహాయపడిన నేషనల్ హిందూ టెంపుల్స్ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి సురేష్, అటవీశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు.