ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా.. | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా..

May 1 2025 1:57 AM | Updated on May 1 2025 1:57 AM

ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా..

ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా..

తమిళసినిమా: మన మానవాళికి భాష ఎంత ప్రాధాన్యమో, అంతే ప్రాముఖ్యత నృత్యానికీ ఉంది. నృత్యం భాషలో ఒక భాగంగా మారింది. ఈ నృత్యంలో కూచిపూడి, భరతనాట్యం, కథక్‌, క్లాసిక్‌ ఇలా చాలా ఉన్నాయి. వాటితో పాటూ ఆధునిక నృత్యం అంటూ బ్యాలెట్‌ నృత్యం కూడా ప్రాచుర్యం పొందింది. వాన్ని బ్యాలే డాన్స్‌ అని కూడా అంటారు. దీనికి ఆధ్యుడు జీన్‌ జార్జెస్‌ నోవెర్రే. ఫ్రెంచ్‌ దేశానికి చెందిన ఈయన ప్రవేశ పెట్టిందే బ్యాలెట్‌ నృత్యం. దీంతో జీన్‌ జార్జెస్‌ నోవెర్రే పుట్టిన రోజు అయిన ఏప్రిల్‌ 29ని ప్రపంచ బ్యాలెట్‌ నృత్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆ విధంగా బుధవారం ప్రపంచ నృత్య దినోత్సవం. కాగా నటి మంజువారియర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రముఖ మలయాళ నటి అయిన ఈమె తమిళ చిత్ర పరిశ్రమలోకి అసురన్‌ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తుణివు, విడుదలై– 2, వేట్టైయన్‌ వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కాగా ఈమె నటుడు ఆర్య, గౌతమ్‌ కార్తీక్‌ కలిసి నటిస్తున్న మిస్టర్‌ ఎక్స్‌ చిత్రంలో నటిస్తున్నారు. కాగా నటి మంజువారియర్‌ మంచి డాన్సర్‌ కావడం గమనార్హం. ఆమె ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా తన కూచిపూడి డాన్స్‌ చేసిన వీడియోను తన ఇన్‌ స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. పలువురు నటి మంజువారియర్‌ నృత్యాన్ని ప్రశంసిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement