
రజనీకాంత్ రూటులో రాజచోళన్
నా జీవితం నా ఇష్టం
తమిళసినిమా: నటి శృతిహాసన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ బహు భాషా కథానాయకి నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వారసురాలు అన్నది తెలిసిందే. బాలీవుడ్లో లక్ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా బాగా పాపులర్ చేసింది. తొలి చిత్రంలోనే గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేశారు. ఆ తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ తొలి చిత్రం నిరాశ పరిచినా ఆ తరువాత నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. దీంతో మొదట్లో అన్ లక్కీ హీరోయిన్గా ముద్ర పడినా పోగా పోగా లక్కీ హీరోయిన్గా మారారు. ముఖ్యంగా తమిళంలో సూర్యకు జంటగా ఆమ్ అరివు చిత్రంతో పరిచయం అయ్యారు. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం అంచనాలను అందుకోలేక పోయింది. అలా చూస్తే శృతిహాసన్ తెలుగు చిత్రాలతోనే వరుస విజయాలను అందుకున్నారు. తాజాగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అదే విధంగా విజయ్ సేతుపతి సరసన ట్రైన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే ప్రేమ వ్యవహారంలో ఈమె ఎప్పుడూ సంచలనమే. ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో విఫలం అయ్యారు. ఇదే ఇప్పుడు శృతిహాసన్‌కు తలనెప్పిగా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ మాట్లాడుతూ ఎందరు బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చారు అని అడుగుతున్నారని, ఇదే వేదన కలిగిస్తోందని చెప్పారు. ఈ విషయమై తాను ఎవరినీ తప్పు పట్టనన్నారు. తన జీవితం తన ఇష్టం అని, తనకు ఇష్టమైనట్లు జీవిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను సింగిల్ అని నటి శృతిహాసన్ పేర్కొన్నారు.
కిస్ మీ ఇడియట్ అంటున్న శ్రీలీల
తమిళసినిమా: టాలీవుడ్లో టాప్ కథానాయకిగా వెలిగిపోతున్న నటి శ్రీ లీల ఇప్పుడు కోలీవుడ్ లోనూ తన వేగాన్ని పెంచేస్తున్నారు. ఇప్పటికే పుష్ప– 2 చిత్రంలో కిసక్ అనే ఐటమ్ సాంగ్‌తో కురక్రారును నిద్రను దూరం చేసిన ఈ బ్యూటీ తమిళంలో సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న పరాశక్తి చిత్రంలో శివ కార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కిస్ మీ ఇడియట్ అనే టైటిల్ నిర్ణయించారు. ఇది నటి శ్రీ లీల 2019లో కన్నడంలో నటించిన శతదినోత్సవ చిత్రం కిస్కు రీమేక్ కావడం గమనార్హం. నాగన్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కన్నడంలో తెరకెక్కించిన ఏపీ అర్జన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో విరాట్ అనే నటుడు కథానాయకుడిగా నటిస్తుండగా రోబో శంకర్, నాంజల్ విజయన్, అస్వతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జయశంకర్ రామలింగం ప్రకాష్ నిక్కి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సెంటిమెంట్‌తో కూడిన యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలో వెల్లడించినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. మొత్తం మీద కోలీవుడ్‌లో నటి శ్రీలీల మలి చిత్రం షూటింగ్ కూడా మొదలైంది అన్నమాట.
హీరో విరాట్, నటి శ్రీలీల

రజనీకాంత్ రూటులో రాజచోళన్