సుందర్‌.సి దర్శకత్వంలో కార్తీ | - | Sakshi
Sakshi News home page

సుందర్‌.సి దర్శకత్వంలో కార్తీ

Apr 23 2025 7:52 AM | Updated on Apr 23 2025 8:39 AM

సుందర్‌.సి దర్శకత్వంలో కార్తీ

సుందర్‌.సి దర్శకత్వంలో కార్తీ

తమిళసినిమా: కోలీవుడ్‌లో ఒక క్రేజీ కాంబోకు శ్రీకారం పడనుందన్నది తాజా సమాచారం. క్లాస్‌, మాస్‌ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్‌ను అలరించే దర్శకుడు సుందర్‌.సి. ఈయన హారర్‌, కామెడీ చిత్రాలు చేయడంలోనూ సిద్ధహస్తుడే. ఈయన ఇంతకుముందు తెరకెక్కించిన అరణ్మణై చిత్ర సీక్వెల్సే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం వడివేలు ప్రధాన పాత్రలు పోషించిన గ్యాంగర్స్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ నెల 24వ తేదీన తెరపైకి రానుంది. తాజాగా నయనతార ప్రధాన పాత్రను పోషిస్తున్న మూక్కుత్తి అమ్మన్‌–2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తరువాత కార్తీ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సుందర్‌.సి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. కార్తీ ప్రస్తుతం సర్దార్‌–2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అదే విధంగా వా వాద్ధియార్‌ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. లోకేష్‌ కనకరాజు ఖైదీ–2 చిత్రాలు కమిట్‌ అయ్యారు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తర్వాత సుందర్‌–సి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. దీన్ని ప్రస్తుతం సర్దార్‌–2 చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రిన్స్‌ పిక్చర్స్‌ అధినేత ఎస్‌.లక్ష్మణన్‌ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement