మేలో జీవీ ‘బ్లాక్‌ మెయిల్‌’ | - | Sakshi
Sakshi News home page

మేలో జీవీ ‘బ్లాక్‌ మెయిల్‌’

Apr 2 2025 1:48 AM | Updated on Apr 2 2025 1:48 AM

మేలో జీవీ ‘బ్లాక్‌ మెయిల్‌’

మేలో జీవీ ‘బ్లాక్‌ మెయిల్‌’

తమిళ సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు జీఏ ప్రకాష్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బ్లాక్‌ మెయిల్‌. నటి తేజు అశ్విని కథానాయకగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు శ్రీకాంత్‌, బిందు మాధవి, లింగ, వేట్టై ముత్తుకుమార్‌, రెడిన్‌ కింగ్స్‌ లీ, రమేష్‌ తిలక్‌, హరిప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకుముందు ఇరుక్కు ఆయిరం కంగళ్‌, కన్నై నంబాదే పంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎం.మారన్‌ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. జేడీఎస్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జయక్కొడి అమల్‌ రాజ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను నటుడు రవి మోహన్‌, విజయ్‌ సేతుపతి ఆన్లైన్‌ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్ర ఫస్టు పోస్టర్‌కు శని ప్రముఖుల నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని యూనిట్‌ వర్గాలు వ్యక్తం చేశారు. చిత్ర దర్శకుడు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మిస్టరీ, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం బ్లాక్‌మెయిల్‌ అని చెప్పారు. చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు విడుదల చేసిన నటుడు రవి మోహన్‌ విజయ్‌ సేతుపతిలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు నిర్మాత పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నిర్మానంత కార్యక్రమాలు జరుపుకుంటున్న బ్లాక్‌ మెయిల్‌ చిత్రాన్ని మేలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ చిత్రానికి శ్యామ్‌. సీఎస్‌ సంగీతాన్ని, గోకుల్‌ బెనాయ్‌ చాయాగ్రహణం అందిస్తున్నారు. లేకపోతే సంగీత దర్శకుడుగా 100కు పైగా చిత్రాలు చేసి మంచి విజయాలను అందుకుంటున్న జీవి ప్రకాష్‌ కుమార్‌కు కథానాయకుడుగా మాత్రం ఇటీవల సరైన విజయం రాలేదు. దీంతో బ్లాక్‌ మెయిల్‌ చిత్రం ఆయనకు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement