జన్మ నక్షత్రం కాంబినేషన్‌ రిపీట్‌ | - | Sakshi
Sakshi News home page

జన్మ నక్షత్రం కాంబినేషన్‌ రిపీట్‌

Jul 23 2025 12:29 PM | Updated on Jul 23 2025 12:29 PM

జన్మ నక్షత్రం కాంబినేషన్‌ రిపీట్‌

జన్మ నక్షత్రం కాంబినేషన్‌ రిపీట్‌

భర్తకు దూరంగా హన్సిక?

తమిళసినిమా: అందానికి మారు పేరు హన్సిక. ఈ ముంబై బ్యూటీ హిందీ, తెలుగు, తమిళం పలు భాషల్లో కథానాయకిగా నటించి పైస్థాయికి చేరుకుంది. అలా అర్ధ సెంచరీకి పైగా చిత్రాలు చేసిన హన్సిక ముఖ్యంగా తమిళంలో ధనుష్‌, విజయ్‌, సూర్య, శివకార్తికేయన్‌, సిద్ధార్థ్‌ వంటి ప్రముఖ హీరోల సరసన నటించి పాపులర్‌ అయ్యారు. కాగా కథానాయకిగా బిజీగా ఉన్న సమయంలోనే 2022లో సోహల్‌ కత్తూరియా అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఆడంబరంగా జరిగింది. కాగా సోహల్‌కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పైళ్లె విడాకులు తీసుకున్న వ్యక్తి అన్నది గమనార్హం. కాగా పెళ్లయిన రెండేళ్లకే హన్సికకు, భర్తకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్‌ అవుతోంది. సోహల్‌ ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈవ్యవహారంపై ముంబైలోని మీడియా హన్సిక వర్గాన్ని సంప్రదించగా వారు అవునని కానీ కాదని కానీ స్పందించలేదని సమాచారం. అయితే సోహెల్‌ మాత్రం స్పందిస్తూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. అయితే ఆయన హన్సిక కలిసి ఉంటున్నారా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఏదేమైనా పెళ్లికి ముందు నటించడానికి అంగీకరించిన కొన్ని చిత్రాలను పూర్తి చేయడానికి హన్సిక సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఆమె టీవీ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా, పాల్గొంటూ, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగానే ఉన్నారు.

తమిళసినిమా: నటుడు తమన్‌ ఆక్షన్‌, మాల్వీ జంటగా నటించిన చిత్రం జన్మ నక్షత్రం. మల్హోత్రా ,రక్ష సెరిన్‌,కాళీ వెంకట్‌,మునీష్‌ కాంత్‌, వేల రామమూర్తి, తలైవాసల్‌ విజయ్‌ యాసర్‌, సంతానభారతీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అమోహం స్టూడియోస్‌ , వైట్‌ లాంప్‌ పిక్చర్స్‌ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి మణివర్మన్‌ కథ, కథనం బాధ్యతలను నిర్వహించారు. కాగా రోమియో పిక్చర్స్‌ సంస్థ అధినేత రాహుల్‌ హారర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో కూడిన జన్మనక్షత్రం చిత్రాన్ని ఈ నెల 18వ తేదీన విడుదల చేశారు. కాగా ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం చిత్ర యూనిట్‌ చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్లో థాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న చిత్ర కథానాయకుడు తమన్‌ ఆక్షన్‌ మాట్లాడుతూ తాను ఇప్పటివరకు పలు చిత్రాల్లో నటించాలని అయితే మొట్టమొదటిసారిగా థాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ చిత్రానికేనని పేర్కొన్నారు. ఇందుకు ఐమోహ స్టూడియోస్‌ నిర్మాతకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ చిత్ర నిర్మాత విజయ్‌తో తనకు చాలా కాలంగా పరిచయం ఉందన్నారు. ఆయన ఈ చిత్రం విడుదలకు ముందు నుంచి ప్రమోషన్‌ పై ఎక్కువగా దష్టి పెట్టారని, దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారని చెప్పారు చిత్రం విడుదల తర్వాత తాము కోయంబత్తూర్‌, సేలం, మధురై వంటి ప్రాంతాలకు వెళ్లి థియేటర్లో ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ ను చూశామన్నారు. తాము ఈ చిత్రానికి మల్టీప్లెక్స్‌ థియేటర్లో ఎక్కువ ఆదరణ లభిస్తుందని భావించామని అయితే అందుకు భిన్నంగా సింగల్‌ థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ చూసి ఆశ్చర్యపోయామని చెప్పారు. అదేవిధంగా ఈ చిత్రాన్ని విడుదల చేసిన రోమియో పిక్చర్స్‌ రాహుల్‌ ముందుగా సుమారు 150 థియేటర్లలో జన్మ నక్షత్రం చిత్రాన్ని విడుదల చేస్తానని చెప్పారన్నారు అయితే ఆ తర్వాత ప్రేక్షకుల ఆదరణతో ఆ సంఖ్య 200, 250, ఇప్పుడు 260 థియేటర్లకు చేరిందన్నారు. తాము ఇంతకుముందు చేసిన ఒరునొడి చిత్రం వసూలు చేసిన మొత్తాన్ని జన్మ నక్షత్రం చిత్రం రెండు రోజుల్లో దాచేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇదే కాంబినేషన్లో తాజాగా తాము మరో చిత్రాన్ని చేస్తున్నట్లు నటుడు తమన్‌ ఆక్షన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement